శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Science-technology - Feb 28, 2020 , 11:49:51

జంతువింత : సొరచేపల రక్త ఘ్రాణశక్తి!

జంతువింత :  సొరచేపల రక్త ఘ్రాణశక్తి!

రక్తం వాసనను పసిగట్టడంలో భారీతెల్ల సొరచేపల (Great white sharks) శక్తి అసాధారణం. కొన్ని మైళ్ల దూరం నుంచే ఇవి రక్తాన్ని గుర్తిస్తాయి. చడీ చప్పుడు కాకుండా వేటాడి చంపడంలో ఆరితేరిన ఈ భయంకర చేపలు సుమారు 3 మైళ్ల దూరంలోంచే రక్తం వాసనను పట్టేస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సుమారు 25 గ్యాలన్ల బకెట్‌ నీటిలో ఒక్క రక్తం చుక్క పడ్డా ఈ సొరచేపలు వాసనతో గ్రహించేయగలవని వారన్నారు. సుమారు 6.1 మీటర్ల పొడవు వరకు పెరిగే దీని బరువు దాదాపు 1,905-2,268 కేజీల వరకు ఉంటుంది. 2014లో జరిగిన ఒక అధ్యయనంలో భారీతెల్ల సొరచేప ఆయుర్ధాయం సుమారు 70 ఏండ్లను మించినట్లు వారు గుర్తించారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన అఖాతాలలో కనిపించే ఈ సొరచేప 1,200 మీటర్ల (3,900 అడుగులు) లోతున, గంటకు 56 కి.మీ.పైబడిన వేగంతో ఈదుతుంది.


logo