న్యాల్కల్/ సంగారెడ్డి : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు న్యాల్కల్ మండలంలోని రేజింతల్- ఎల్గోయి గ్రామ శివారు మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా, బైక్పై వెళ్తున్న ఓ గుర్తు తెలియని యువకుడు వాగులో గల్లంతయ్యాడు. యువకుడి కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.