సంగారెడ్డి మున్సిపాలిటీ, జూన్ 30: ఉద్యోగ సంఘాలపై అభిమానంతో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో మార్చి 22న చర్చలు జరిపారని టీఎన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ టీఎన్జీవో ఉద్యోగుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ 9 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ పింఛన్ సహా ఇతర ఉద్యోగులకు 30శాతం ఫిట్ కూడిన పీఆర్సీ ప్రకటించడం హర్షణీయమన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇది మొదటి పీఆర్సీ అన్నారు. 1-7-2018 నుంచి రావాల్సిన 11వ పీఆర్సీ కరోనాతో ఆలస్యమైందన్నారు. 1-4-2021 వరకు కరోనా సమస్యతో రాలేదని, పీఆర్సీ ప్రకటించడంతో ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యూటీ పింఛన్ పాటు క్వాంటం ఆఫ్ పెన్షన్ రూ.12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచడం శుభ పరిణామం అన్నారు. కరోనాతో చనిపోయిన వారి ఉద్యోగ కుటుంబాలకు కారుణ్య నియామకాలవ్వాలని కోరారు. హరితహారంలో ప్రతి ఉద్యోగి పాల్గొని 5 మొక్కలు నాటాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశంలోనే ఎంపీ సంతోష్ రికార్డు సాధించారన్నారు. ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని సీఎం కేసీఆర్ కోరామని తెలిపారు. అనంతరం టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్, అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, జిల్లా అధ్యక్షుడు సుశీల్ కార్యదర్శి నర్సింలు, సభ్యులు రవి, వెంకట్ శ్రీకాంత్, సిద్దిరాం, శ్రీనివాస్, గౌస్ హాష్మీ, జనార్దన్, జీ.శ్రీనివాస్, రాజకుమారి, సుధామణి, భాస్కర్, వేణు తదితరులు పాల్గొన్నారు.