e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జిల్లాలు Sangareddy | ఎడ్యుకేషన్‌ హబ్‌గా జిన్నారం

Sangareddy | ఎడ్యుకేషన్‌ హబ్‌గా జిన్నారం

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

- Advertisement -

జిన్నారం, సెప్టెంబర్‌13 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. జిన్నారం శివారులోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో రూ.కోటి 35లక్షలతో నిర్మించిన బాలికల కళాశాల భవనం, రూ.42 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిన్నారంలో మండలంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.

జిన్నారంలో జూనియర్‌ కళాశాల, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల, జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిందన్నారు. మండల కేంద్రం జిన్నారంలో ఏర్పాటు కావాల్సిన మోడల్‌ స్కూల్‌ బొల్లారానికి తరలిపోయిందని దీంతో వెనుకబడిన కుటుంబాల పిల్లలు నాణ్యమైన చదువుకు దూరం అయ్యారని స్థానిక ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌ ఎమ్మెల్యేకు తెలిపారు. అవకాశం ఉంటే జిన్నారంలో మరో మోడల్‌ స్కూల్‌, బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు. అలాగే జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు రావాలంటే రవాణా సౌకర్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి
వాహనం ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ జిన్నారంలో మోడల్‌ స్కూల్‌ కానీ గురుకుల పాఠశాల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతానని, అలాగే విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు రవాణా సౌకర్యం విషయంపై ఆర్‌టీసీ అధికారులతో మాట్లాడతానన్నారు. అవసరమైతే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తానన్నారు.

మినీ స్టేడియం పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఖాజీపల్లి గ్రామంలోని దుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎమ్మెల్యే దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ లావణ్యాశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశంగౌడ్‌, లావణ్య, వైస్ ఎంపీపీ గంగు రమేశ్‌, సర్పంచ్‌లు జనార్దన్‌, ఆంజనేయులు, శివరాజ్‌, వెంకటయ్య, తహసీల్దార్‌ దశరథ్‌, ఎంపీటీసీ సుమతి, విజయ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్‌, ఉపసర్పంచ్‌ సంజీవ, నాయకులు సురేందర్‌గౌడ్‌, రవీందర్‌, కృష్ణ, సార నరేందర్‌, మహేశ్‌, పుట్టి భాస్కర్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఇంతియాజ్‌ అహ్మద్‌, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ కవిత, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నరేశ్‌కుమార్‌, నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana