e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home సంగారెడ్డి నిఘా నీడలో గడ్డపోతారం

నిఘా నీడలో గడ్డపోతారం

  • 36 సీసీ కెమెరాలతో గ్రామంలో పహారా
  • కెమెరాల ఏర్పాటుకు పలువురు సహకారం
నిఘా నీడలో గడ్డపోతారం

జిన్నారం, జూన్‌ 12 : గడ్డపోతారం గ్రామం పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోకి వచ్చింది. కాలుష్య వ్యర్థాల పారబోత నేపథ్యంలో పారిశ్రామిక వాడలో మూడు, నాలుగు సంవత్సరాల క్రితం పలు పరిశ్రమలు కలిసి ఒకటి రెండు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు దొంగతనాలు, నేరాల నియంత్రణ కోసం రెండు, మూడు సంవత్సరాల క్రితం పారిశ్రామిక వాడలోకి వచ్చే ప్రధాన రోడ్డుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో చాలా వరకు ఇబ్బందులు తొలిగాయి. వాహనాలలో వ్యర్థాల తరలింపు, పారబోతలు చాలా వరకు తగ్గాయి. కాగా గడ్డపోతారం గ్రామ పంచాయతీలో నేరాల నియంత్రణ, దొంగతనాలను పూర్తిగా అరికట్టేందుకు సర్పంచ్‌ ప్రకాశ్‌చారి గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గడ్డపోతారం, చెట్లపోతారం, అల్లీనగర్‌, ప్రశాంత్‌నగర్‌, పారిశ్రామికవాడలో ముఖ్యమైన ప్రదేశాలు, చౌరస్తాల్లో 36 కెమెరాలను పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వీటిని మానిటరింగ్‌ చేసేందుకు గ్రామ పంచాయతీలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ టీవీలను అరబిందో పరిశ్రమ అందజేసింది. గడ్డపోతారం పంచాయతీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలపై ప్రత్యేక కథనం…

నేరాల నియంత్రణకు చెక్‌
గడ్డపోతారం పంచాయతీలో సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలు, నేరాల నియంత్రణకు చెక్‌ పడినట్లే. గ్రామానికి ఎవరొస్తున్నారో…ఎవరు వెళ్తున్నారో తెలుస్తున్నది. పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమల్లో పని చేసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి కార్మికులు వస్తుంటారు. కొన్ని రోజుల నుంచి పనిచేస్తున్న వాళ్లు రాత్రికి రాత్రే మాయం అవుతారు. ఊరు విడిచి వెళ్లారా…లేదా ఏదైన ఊహించని ఘోరం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగి సమీపంలోనే శవాలుగా దొరికిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఘటనల్లో నిందితులను గుర్తించేందుకు కొంత ఆలస్యం జరిగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. చీమ చిటుక్కుమన్న తెలుసుకోవచ్చు. అనుమానితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. గడ్డపోతారం పంచాయతీ 24 గంటలు ప్రత్యేక నిఘాలోకి వెళ్లింది.

- Advertisement -

ప్రజల ప్రశాంతత కోసమే..
రోజు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని ఇంటికి వచ్చే ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి భయాందోళనలకు లోనుకావద్దు. అందుకే గడ్డపోతారం పంచాయతీలో 36 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పారిశ్రామక వాడ, గడ్డపోతారం, చెట్లపోతారం, అల్లీనగర్‌, ప్రశాంత్‌నగర్‌ కవర్‌ అయ్యేలా ప్రధాన చౌరస్తాలు, గ్రామాలకు వచ్చి వెళ్లే వాహనాలు, వ్యక్తులను గుర్తించేలా సీసీ కెమెరాలు పెట్టాము.

  • ప్రకాశ్‌చారి, గడ్డపోతారం సర్పంచ్‌ సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
    గడ్డపోతారంలో సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం. వీటితో నేరాలు, దొంగతనాలను చాలా వరకు నియంత్రించవచ్చు. గ్రామాలకు ఎవరొస్తున్నారు. ఎవరు వెళ్తున్నారు. ఎవరు అనుమానితులో గుర్తించవచ్చు. దొంగతనాలు, నేరాలు చేయాలనుకునే వారు సీసీ కెమెరాలను చూసి వెనకడుగు వేయాల్సిందే. 24 గంటలు పనిచేసే సీసీ కెమెరాలతో భయం లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు. గ్రామానికి సంబందించిన సీసీ కెమెరాలు కానీ, కాలనీ, ఇండ్లలో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ఐపీ అడ్రస్‌తో ఫోన్‌లో ఎక్కడున్నా గ్రామ, ఇంటి పరిసరాలను సీసీ కెమెరాల ద్వారా చూడొచ్చు.
  • ప్రశాంత్‌, సీఐ బొల్లారం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిఘా నీడలో గడ్డపోతారం
నిఘా నీడలో గడ్డపోతారం
నిఘా నీడలో గడ్డపోతారం

ట్రెండింగ్‌

Advertisement