e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home సంగారెడ్డి ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ

 • అదుపులో శాంతిభద్రతలు
 • పోలీస్‌ శాఖ పనితీరు భేష్‌
 • రాష్ట్రంలో 70 శాతం సీసీ కెమెరాలు
 • నేరాలు చేసేందుకు భయపడుతున్న నిందితులు
 • షీ టీమ్స్‌తో మహిళలకు భద్రత
 • పోలీస్‌ శాఖ పటిష్టానికి సీఎం కేసీఆర్‌ కృషి
 • కరోనా నియంత్రణలో పోలీసుల సేవలు అమోఘం
 • హోమంత్రి మహమూద్‌ అలీ, శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ

సంగారెడ్డి, జూన్‌ 12 : ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలుతో పోలీసులు ప్రజలకు చేరువయ్యారని, దీంతో సత్ఫలితాలను వస్తున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, పోలీస్‌శాఖ ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టిసారించిందని, అత్యాధునికంగా ఠాణాలు, పోలీస్‌ సిబ్బంది క్వార్టర్స్‌ నిర్మిస్తున్నదని, పోలీసులు చేస్తున్న సేవలు భేష్‌ అని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. శనివారం సంగారెడ్డిలో పోలీస్‌ స్టేషన్‌ నూతన భవనాన్ని శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. పోలీస్‌ హౌసింగ్‌ సొసైటీ నిధులు కోటి రూపాయలతో అత్యాధునికంగా ఈ పోలీస్‌స్టేషన్‌ నిర్మించారు. ఈ సందర్భంగా కొత్త భవనంలో గదులను పరిశీలించి, జనరల్‌ డైరీలో హోంమంత్రి వివరాలు నమోదు చేశారు. తర్వాత స్థానిక పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 70శాతం సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తయిందని, నేరాలు చేసేందుకు నిందితులు బయపడుతున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పోలీసుల సేవలు విస్తరించాయని, శాంతిభద్రతలు పక్కాగా అమలవుతున్నట్లు తెలిపారు. మహిళల సంరక్షణకు షీటీమ్స్‌ విజయవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు పోలీసులు తమవంతు సేవలు అందిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. పోలీస్‌ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన అమలు చేసి వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. నూతన భవనాల నిర్మాణంతో అధునాతన గదులు అందుబాటులోకి వచ్చాయని, విశ్రాంతితో పాటు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారికి సౌకర్యంగా మారిందన్నారు. శాంతిభద్రతలు బాగుండడంతోనే రాష్ర్టానికి పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థలు వస్తున్నట్లు తెలిపారు. ‘డయల్‌ 100’కు కాల్‌చేసిన నిమిషాల వ్యవధిలోనే సంఘటనా ప్రదేశాలకు పోలీసులు చేరుకుంటున్నారని తెలిపారు.

పోలీసులంటే భయం పోయింది..

 • మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి
  గతంలో పోలీస్‌ స్టేషన్లకు వెళ్లాలంటే జనం బయపడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలుతో ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొందని శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. పోలీస్‌శాఖ ఆధునీకరణకు సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నందుకే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ దేశానికి ఆదర్శమన్నారు. పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని అభినందించారు. కార్యక్రమంలో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌ గుప్తా, నార్త్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీ శివశంకర్‌రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఎస్పీ సృజన, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ

ట్రెండింగ్‌

Advertisement