e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home సంగారెడ్డి సాగుకు సమాయత్తం

సాగుకు సమాయత్తం

సాగుకు సమాయత్తం
  • వానకాలం పంటకు సిద్ధమవుతున్న అన్నదాత
  • పంటల సాగుకు త్వరలో రైతుబంధు డబ్బులు
  • రైతు ఖాతాలో జమ చేసేందుకు సర్కార్‌ కసరత్తు

జహీరాబాద్‌, మే 30 : తొలకరి చినుకు నేల రాలుతోంది. నాలుగైదు రోజులుగా వరుణుడు నేనున్నాంటూ పలకరిస్తున్నాడు. నైరుతి రుతుపవనాల ఆగమనం బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి పభావంతో అడపదడపా వర్షం కురుస్తుంది. అన్నదాతలు పంటలు సాగు చేసేందుకు సీఎం కేసీఆర్‌ రైతు బంధు(పంట పెట్టుబడి) ఖర్చుల కోసం డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. జూన్‌ మొదటి వారంలో రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు వ్యవసాయ శాఖ రైతుల వివరాలు సేకరిస్తున్నది. రైతులు పంటలు సాగు చేసేందుకు వ్యవసాయ భూములు సిద్ధం చేశారు. పంటలు సాగు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సహాయం చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జహీరాబాద్‌లో 69,429.59 హైకార్టులో సాగుకు సిద్ధం
జహీరాబాద్‌ వ్యవసాయ శాఖ సబ్‌ డివిజన్‌ పరిధిలో జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, కోహీర్‌, ఝరాసంగం మండలం ఉంది. వానకాలం సీజన్‌లో రైతులు 69,429.59 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జహీరాబాద్‌ ప్రాంతంలో సాగు విస్తీర్ణం 69,429.59 హెక్టార్లు ఉంది. గతంలో రైతులు పంటలు సాగు చేసేందుకు బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పలు తీసుకొనేవారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్‌ పంట పెట్టుబడి కోసం రైతు బంధు పథకంలో ఎకరాకు రూ.10 వేలు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు ఎవరూ బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొనేందుకు ఆసక్తి చూపడం లేదు. జూన్‌ మొదటి వారంలో రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యవసాయ శాఖ రైతులు వివరాలు సేకరిస్తున్నది. బ్యాంకుల ఖాతాలు, భూముల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమో దు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.

సబ్సిడీ విత్తనాలు పంపిణీ
జహీరాబాద్‌లో ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పై జనుము, జీలుగ విత్తనాలు పంపిణీ చేసింది. జనుము, జీలుగ పంట సాగు చేసి భూమిలో దున్నడంతో సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ ఏడాది రైతులు అధికంగా పంటలు సాగు చేసేందుకు సేంద్రియ ఎరువులు భూముల్లో వేశారు. రసాయన ఎరువులతో పంట పెట్టుబడి పెరిగిపోవడం..మార్కెట్‌లో రసాయన ఎరువులతో సాగు చేసిన పంటలకు డిమాండ్‌ లేకపోవడంతో రైతులు సేంద్రియ ఎరువుల వైపు మొగ్గుచూపుతున్నారు. వాన కాలం సీజన్‌ ప్రారంభం కంటే ముందుగా వ్యవసాయ శాఖ రైతులకు విత్తనాలు పంపిణీ చేసింది.

ఎరువులు, విత్తనాలు సిద్ధం
వాన కాలంలో పంటలు సాగు చేసే రైతులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఎరువు లు, విత్తనాలు సిద్ధంగా ఉంచింది. జహీరాబాద్‌లో ప్రైవేటు వ్యాపారులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకాలు చేసేందుకు ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశారు. వాన కా లంలో రైతులు అధికంగా పెసర, మినుము, కంది, సోయా, జొన్న, పత్తి సాగు చేస్తారు. వర్షధారంగా అధిక మంది రైతులు పంటలు సాగు చేస్తారు. రైతులు వేసవిలో భూ ములు ట్రాక్టర్లుతో దున్ని పంటలు సాగు చేసేందుకు సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో రైతులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు బ్లాక్‌లో విత్తనాలు, ఎరువులు అమ్మకాలు చేస్తే కేసు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మకాలు చేస్తే కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటు వ్యాపారులు విత్తనాలు, అమ్మకాలు చేయడంతో రైతులకు నష్టం జరుగుతుంది. దీని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేని షాపులు గుర్తిం చి సీజ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాగుకు సమాయత్తం

ట్రెండింగ్‌

Advertisement