e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home జిల్లాలు ఐకేపీ ఆధ్వర్యంలో 110 కొనుగోలు కేంద్రాలు

ఐకేపీ ఆధ్వర్యంలో 110 కొనుగోలు కేంద్రాలు

ఐకేపీ ఆధ్వర్యంలో 110  కొనుగోలు కేంద్రాలు

జిల్లా లో 6లక్షల 64వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు : డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌
చిన్నశంకరంపేట, మే 29: జిల్లాలో ఇప్పటి వరకు ఐకేపీ ఆధ్వర్యంలో 14,600 మంది రైతుల నుంచి 6లక్షల64వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం మండలంలోని వెంకట్‌రావుపల్లి, రుద్రారం, మల్లుపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో 110 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 12,600 మంది రైతులకు రూ.78కోట్ల్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య, డీపీఎం మోహన్‌, ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి, సీసీలు యశోద, రాజు, వీవోఏలు లావణ్య, శేఖర్‌ ఉన్నారు.
చేగుంటలో…
చేగుంట, మే29: జిల్లా వ్యాప్తంగా రైతుల వద్ద 6లక్షల64వేల వేల క్వింటాల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా గ్రామీ ణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ అన్నారు. చేగుంట మండల పరిధిలోని రాంపూర్‌, కరీంనగర్‌, చిన్నశివునూర్‌,పోతాన్‌పల్లిలోని ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు.ఈసందర్భంగా పీడీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 110 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు పూర్తియైన 6సెంటర్లను మూసివేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అధినపు అధికారి భీమయ్య, డీపీఎం మోహన్‌, ఏపీఎం లక్ష్మీ నర్సమ్మ, సీసీలు రామస్వామి, స్వామి, అంజయ్య, వీవోలు శంకర్‌, అరుణ, రాంపూర్‌ సర్పంచ్‌ భాస్కర్‌ తదితరులున్నారు.
నవదుర్గా రైస్‌ మిల్లులో ధాన్యాన్ని
పరిశీలించిన
జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌
తూప్రాన్‌ రూరల్‌, మే 29 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ రైతులకు భరోసా కల్పించారు. తూప్రాన్‌ పట్టణ శివారులోని నవదుర్గా రైస్‌ మిల్లును తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, డీసీఎస్‌వో శ్రీనివాస్‌తో కలిసి శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కరోనా దృష్ట్యా హమాలీల కొరుతతో ఆలస్యం అవుతుందన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముం దస్తు జాగ్రత్తగా ధాన్యం నిల్వల కోసం ప్రైవేటు గోదాములను అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తుందన్నారు.ఆయన వెంట తూప్రాన్‌ తహసీల్దార్‌ శ్రీదేవి,డిప్యూటీ తహసీల్దార్‌ నాగవర్ధన్‌, రెవెన్యూ సిబ్బంది సంపత్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐకేపీ ఆధ్వర్యంలో 110  కొనుగోలు కేంద్రాలు

ట్రెండింగ్‌

Advertisement