e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home సంగారెడ్డి ‘మిషన్‌' వేగం..తీరనున్న దాహం

‘మిషన్‌’ వేగం..తీరనున్న దాహం

‘మిషన్‌' వేగం..తీరనున్న దాహం
  • శరవేగంగా పట్టణ ‘మిషన్‌ భగీరథ’ పనులు
  • సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేటపట్టణాల్లో 70శాతం పనులు పూర్తి
  • రూ.82.59 కోట్లతో మున్సిపాలిటీల్లో పనులు
  • మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో సంగారెడ్డికి అదనపు ట్యాంకు మంజూరు
  • తీరనున్న తాగునీటి ఇబ్బందులు

సంగారెడ్డి, మే 24 (నమస్తే తెలంగాణ) : ఇంటింటికీ శుద్ధినీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ పథ కం రాష్ట్రంలో విజయవంతమైన సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని ప్రజలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్‌లోని మారుమూల ప్రాంతాల గ్రామాలకు సైతం మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నది. సం గారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట ము న్సిపాలిటీల్లో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూడు పట్టణాల్లో ప్రస్తుతం ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నది. కొన్నిచోట్ల పైప్‌లైన్‌ పనులు పూర్తయిన చోట మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీరు అందజేస్తున్నారు. ప్రస్తుతం మూడు మున్సిపాలిటీల్లో 50 శాతానికి పనులు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట మున్సిపాలిటీల్లో పనులు పూర్తి కానున్నాయి.

అక్టోబర్‌లో మూడు మున్సిపాలిటీల్లో వందశాతం మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కానున్నది. ఇటీవల ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మూడు మున్సిపాలిటీల్లో మిషన్‌ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ల పనుల్లో వందశాతం నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రభుత్వం రూ.82.59 కోట్లతో ఈ మూడు మున్సిపాలిటీల్లో మిషన్‌ భగీరథ పనులు చేపడుతున్నది. నీటి సరఫరా కోసం మూడు మున్సిపాలిటీల్లో 8500 లీటర్ల సామర్థ్యం కలిగిన 14 ట్యాంకులు నిర్మించడంతో పాటు 205.87 కిలోమీటర్ల పైప్‌లైన్‌ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం మూడు మున్సిపాలిటీల్లో ఐదు ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యాయి. 139 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ పనులు పూర్తిచేశారు. అక్టోబర్‌ నాటికి వందశాతం పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.

రూ.15 కోట్లతో సంగారెడ్డిలో అదనపు పనులు..
సంగారెడ్డిలో ప్రస్తుతం కొనసాగుతు న్న తాగునీటి సరఫరా వ్యవస్థకు అదనం గా మిషన్‌ భగీరథ ద్వారా రూ.15.01 కోట్లతో అదనపు పనులు చేపడుతున్నా రు. సంగారెడ్డి మున్సిపాలిటీల్లో ఇది వర కే నీటి సరఫరా కోసం 10 నీటి ట్యాంకు లు నిర్మించారు. వీటికి అదనంగా 2300 లీటర్ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు ఉపరితల నీటి ట్యాంకుల నిర్మిస్తున్నారు. రెండు ట్యాంకుల నిర్మాణం పూర్తి కాగా, మరో రెండు ట్యాంకుల నిర్మాణం కొనసాగుతున్నది. పట్టణంలో 32.09 కిలోమీటర్ల పైప్‌లైన్‌ పనులు ప్రారంభించా రు. ఇందులో 22.86 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తయ్యింది. మిగతా పైప్‌లైన్‌ పనులు కొనసాగుతున్నాయి. వెలుగు కార్యాలయం వద్ద పంప్‌హౌస్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందు లో ఎనిమిది పంపులను బిగిస్తున్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు కలెక్టరేట్‌ వెనుక వైపు విద్యానగర్‌ కాలనీలో చిల్డ్రన్‌పార్కు ప్రారంభించారు. ఈ సందర్భం గా స్థానికులు నీటి సమస్య పరిష్కారం కోసం అదనపు ట్యాంకు నిర్మించాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకును మంజూరు చేశారు. ట్యాంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిషన్‌ భగీరథలో భాగంగా చేపడుతున్న అదనపు ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్‌ పనులు అక్టోబర్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ పనులు పూర్తయితే పట్టణంలో 4916 గృహాలకు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా కానున్నది.

రూ.44.47 కోట్లతో సదాశివపేట పట్టణంలో..
సదాశివపేట మున్సిపాలిటీకి ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా రూ.44.47 కోట్లతో నూతన తాగునీటి సరఫరా పథకాన్ని మంజూరు చేసింది. ఇందు లో భాగంగా పట్టణంలో 4500 లీటర్ల సా మర్థ్యం ఉన్న 8 ఉపరితల ట్యాంకులు, 128.88 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో 3 ట్యాంకుల నిర్మాణాలు పూర్తికాగా, 5 ట్యాంకుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే, 128.88కిలోమీటర్ల పైప్‌లైన్‌కు 81.20 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. సాయిబాబా కాలనీలో 65కిలోవాట్‌ సామర్థ్యం కలిగిన 2 పంప్‌ లతో పంప్‌హౌస్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 11,000 గృహాల్లో సర్వేచేసి మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు ఇస్తున్నారు. ఈఏడాది చివరి వరకు పను లు పూర్తయ్యే అవకాశం ఉంది. పనులు పూర్తయితే పట్టణంలో ఇంటింటికీ తాగునీరు అందనున్నది. జ

హీరాబాద్‌లో 50 శాతానికి పైగా పూర్తి…
జహీరాబాద్‌ మున్సిపాలిటీలో ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి సరఫరా వ్యవస్థ అదనంగా మిషన్‌ భగీరథలో రూ.23.11 కోట్లతో తాగునీటి సరఫరా పథకాన్ని ప్రభు త్వం మంజూరు చేసింది. పట్టణంలో 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. పట్టణంలో 1700 లీటర్ల సామర్థ్యం కలిగిన 2 ట్యాంకుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 44.9 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేయా ల్సి ఉండగా, 35.50కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. రహ్మత్‌నగర్‌లో పంప్‌ హౌస్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నా యి. నీటి సరఫరా కోసం పంప్‌హౌస్‌లో 90 కిలోవాట్ల పంప్‌లు రెండు, 45 కిలోవాట్ల పంప్‌ ఒకటి బిగిస్తున్నారు. అక్టోబర్‌ నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘మిషన్‌' వేగం..తీరనున్న దాహం

ట్రెండింగ్‌

Advertisement