e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home సంగారెడ్డి సమన్వయంతో గ్రామాల అభివృద్ధి

సమన్వయంతో గ్రామాల అభివృద్ధి

సమన్వయంతో గ్రామాల అభివృద్ధి
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
  • దువ్వగుంటలో రూ.34 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

జిన్నారం, జూన్‌ 23 : గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మాదారం పంచాయతీ దువ్వగుంట గ్రామంలో రూ.34 లక్ష ల సొంత నిధులతో సీసీ రోడ్డు పనులకు శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు సొంత నిధుల తో దువ్వగుంట నుంచి జానకంపేట గ్రామం వరకు సుమారు కిలోమీటరు దూరం సీసీ రోడ్డు వేయిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసి పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతరం స్థానికులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, సర్పంచ్‌ సరితసురేందర్‌గౌడ్‌, జిన్నారం ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌, నల్తూరు సర్పంచ్‌ జనార్దన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజేశ్‌, ఉప సర్పంచ్‌ మల్లేశ్‌, నాయకులు రాంచందర్‌గౌడ్‌, దుర్గ య్య, మల్లేశ్‌, ఆంజనేయులు, విజయ్‌గౌడ్‌ ఉన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు ఎంతో మేలు
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మం జూరైన రూ.34 లక్షల 67 వేల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఎంతో మంది పేదలకు మేలు జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసేందు కు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, తెల్లాపూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రాములుగౌడ్‌, రామచంద్రాపురం కార్పొరేటర్‌ పుష్పానగశ్‌, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -

సంచార చేపల విక్రయ కేంద్రం ప్రారంభం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో మంజూరైన సంచార చేపల విక్రయ కేంద్రాల వాహనాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.10 లక్షల విలువ చేసే వాహనాలను సబ్సిడీ ద్వారా రూ.6 లక్షలకే ప్రభుత్వం అందజేస్తుందని ఆయన తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్లకు ఒక్కొక్కటి చొప్పున మంజూరైనట్లు ఆయన చెప్పారు

రైతులు నష్టపోకుండా చూడాలి
విద్యుత్‌ టవర్ల ఏర్పాటుతో రైతులు నష్టపోకుండా చూడాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి విద్యుత్‌ అధికారులకు సూచించారు. బుధవారం ఖాజీపల్లి గ్రామం వచ్చిన సందర్భంగా తమ పొలాల్లో విద్యుత్‌ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా టవర్లు ఏర్పాటు చేసే స్థలాలను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రామ్‌జీ నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. టవర్లు ఏర్పాటు చేసే స్థలాలన్నీ రైతుల పట్టా భూములని, దీంతో రైతులు చాలా నష్టపోతారని ఎస్‌ఈకి తెలిపారు. ఎమ్మెల్యే వెంట జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, సర్పంచ్‌ చిట్ల సత్యనారాయణ ఉన్నారు.

సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి
సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఖాజీపల్లి సర్పంచ్‌ చిట్ల సత్యనారాయణ గ్రామంలోని రైతులకు ఉచితంగా వరి విత్తనాలు అందజే యడం అభినందనీయమన్నారు. బుధవారం గ్రామంలో ఖాజీపల్లి గ్రామ రైతులకు వరి విత్తనాలను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీటీసీ ఆకుల భార్గవ్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ప్రజలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌
ఆపదలో ఉన్న ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలసుస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో బొల్లారం మున్సిపాలిటీకి చెందిన శశికళకు రూ. 28వేలు, ఎండీ అషన్‌కు రూ.27వేల చెక్కులను జిన్నారం మాజీ జడ్పీటీసీ, బొల్లారం టీఆర్‌ఎస్‌ నాయకులు కొలన్‌ బాల్‌రెడ్డి సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో ఆర్సీపురం కార్పొరేటర్‌ పుష్పనగేశ్‌, నాయకుడు మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమన్వయంతో గ్రామాల అభివృద్ధి
సమన్వయంతో గ్రామాల అభివృద్ధి
సమన్వయంతో గ్రామాల అభివృద్ధి

ట్రెండింగ్‌

Advertisement