e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home సంగారెడ్డి విత్తన ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి

విత్తన ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి

విత్తన ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి
  • అప్రమత్తతే మేలు
  • మార్కెట్లో నకిలీ విత్తనాలతో జాగ్రత్త
  • కొనుగోలు రసీదులు తప్పనిసరి
  • వ్యవసాయశాఖ సూచనలు పాటించాలి

మునిపల్లి, జూన్‌ 19 : చెట్టు నంబర్‌ వన్‌ అయితే కాయ నంబర్‌ వన్‌ అవుతున్నదని ఓ సినిమాలో డైలాగ్‌.. మరి చెట్టే నంబర్‌ వన్‌ కావాలంటే విత్తనం మరింత నంబర్‌ వన్‌ కావాలి. రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. విత్తనాలు కొనేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ, నాణ్యత లేని విత్తనాలను అంటగట్టే పనిలో కొందరు వ్యాపారులుంటారు. విత్తనాలు కొనుగోలు చేయడమే తప్ప వాటి స్థితిగతులను గమనించకపోవడంతో రైతులు ఏటా నష్టాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. రైతులు నిర్లక్ష్యం వహిస్తే తీరని నష్టం వాటి ల్లుతున్నది.

తక్కువ ధరను నమ్మొద్దు..

వానకాలం పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. మునిపల్లి మండలంలో రైతులు పత్తి పంటను అధికంగా పండిస్తారు. రైతులు ఫర్టిలైజర్‌ దుకాణాల్లో విత్తనాలు కొంటుంటారు. ఇదే అదనుగా భావిస్తున్న కొంతమంది వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టేందుకు ప్రయత్నిస్తారు. తక్కువ ధరకు ఇస్తుండడంతో నాణ్యత లేని విత్తనాలైనా సరే రైతులు కొనుగోలు చేస్తుంటారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా లాభాల సాగు చేయవచ్చు.

అధికారుల తనిఖీలు అవసరం..

- Advertisement -

మునిపల్లి మండలంలో అనుమతులు లేని ఫర్టిలైజర్‌ దుకాణాలు చాలా ఉన్నాయి. మండలంలోని సంబంధిత శాఖ అధికారులు ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని రైతులు కోరుతున్నారు. నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. గతంలో మునిపల్లి మండలంలోని బుధేరా చౌరస్తాలో ఓ వ్యాపారి రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేయడంతో తీవ్రంగా నష్టపో యారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి విత్తనాల స్టాక్‌, రిజిస్టర్లను పరిశీలించాలి.

విత్తన కొనుగోలులో జాగ్రత్తలు తప్పనిసరి..

  • అధీకృత డీలర్‌ షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. తక్కువ ధరకు వస్తున్నాయని అనధికార వ్యక్తుల నుంచి కొనుగోలు శ్రేయస్కరం కాదు.
  • కొనుగోలు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లులో విత్తన లాట్‌ నెంబర్‌, కాల పరిమితి ముగింపు వివరాలు ఉండేట్లు చూసుకోవాలి. దానిపై రైతు సంతకంతో పాటు అధీకృత డీలర్‌ సంతకం తప్పనిసరిగా ఉండాలి. తీసుకున్న బిల్లు, విత్తన ప్యాకెట్‌ను పంటకాలం ముగిసేవరకు దాచిఉంచాలి.
  • బీజీ-1, బీజీ-2 విత్తనాలకు మాత్రమే అనుమతి ఉంది. దళారుల మాటలు నమ్మి బీజీ-3 విత్తనాలు కొనుగోలు చేయవద్దు
  • కలుపు మందు తట్టుకుంటుంది అని ఎవరైనా బీజీ-3 విత్తనాలు అమ్మాలని చూస్తే తక్షణం పోలీసులు లేదా వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలి.
  • విత్తనం ఎంపిక చేసుకునే సమయంలో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలి.
  • విత్తన ప్యాకెట్లపై ఉన్న గరిష్ఠ చిల్లర ధరకు మించి కొనుగోలు చేయవద్దు.

అవగాహన ముఖ్యం

విత్తనాలపై రైతులు తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి. కొన్న ప్యాకెట్లో ఉన్న విత్తనాలు ఎంత శాతం మొలకెత్తుతాయో చూసుకోవాలి. పంటకాలం పూర్తయ్యేవరకు రైతులు కొనుగోలు చేసిన విత్తనాల ప్యాకెట్లతో పాటు రసీదులను తప్పకుండా ఉంచుకోవాలి. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. నకిలీ విత్తనాలు అమ్మితే వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలి.
శివకుమార్‌, వ్యవసాయధికారి, మునిపల్లి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విత్తన ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి
విత్తన ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి
విత్తన ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి

ట్రెండింగ్‌

Advertisement