e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home సంగారెడ్డి సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిది

సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిది

సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిది
  • మెడికల్‌ కళాశాల మంజూరు చేసి హామీ నెలబెట్టుకున్నారు
  • సంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
  • మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి

సంగారెడ్డి, మే 18: సంగారెడ్డి జిల్లాకు మెడికల్‌ కళాశాల మంజూరు చేసి సీఎం కేసీఆర్‌ హామీ నిలబెట్టుకున్నారని,ఈ ప్రాంత ప్రజల కలను సాకారం చేశారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జిల్లాకు మెడికల్‌ కళాశాల మంజూరు చేసినందుకు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డిలో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని 2018 ఎన్నికల్లో సంగారెడ్డి సభలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి హామీని సీఎం కేసీఆర్‌ నెరవేర్చారన్నారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పలుమార్లు విన్నవించినట్లు తెలిపారు. వైద్య కళాశాల, నర్సింగ్‌, డెంటల్‌ కాలేజీల ఏర్పాటుతో వైద్యహబ్‌గా సంగారెడ్డి మారుతుందని, ఎందరికో ఉపాధి దొరుకుతుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.

సరిహద్దు ప్రాంతాల ప్రజలకు మేలు..
రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాలు జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాలను మంజూరు చేయడంతో విద్యార్థులు సంతోషంలో మునిగిపోయారన్నారు. ఎంబీబీఎస్‌ చదవాలనుకుంటే అది డబ్బున్న ధనికులకే సాధ్యమయ్యేదని, కానీ.. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో జిల్లా కేంద్రంలో చదువుకునే అవకాశం కల్పించడం గొప్పవిషయమన్నారు. కర్ణాటకలోని బీదర్‌, గుల్బార్గా పట్టణాల్లో ఎంబీబీఎస్‌ చదువుల కోసం పరుగులు పెట్టే జిల్లా విద్యార్థులకు, రాబోయే రోజుల్లో సం గారెడ్డిలో వైద్య విద్య అందుబాటులోకి రానున్నదన్నారు. అన్నదాతల సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జిల్లాలోని సింగూర్‌, మంజీరా ప్రాజెక్టులను నింపి సాగునీళ్లు అందించే కార్యక్రమం త్వరలో రూపుదిద్దుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్నదాతలు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే వారు అన్నారు. సమావేశంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, సీడీసీ చైర్మన్‌ కాపాల బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శు లు వెంకటేశ్వర్లు, నర్సింహులు, కౌన్సిలర్లు రామ ప్ప, అశ్విన్‌ కుమార్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మ సూద్‌, కో ఆప్షన్‌ సభ్యులు, నాయకులు జైపాల్‌రెడ్డి, డాక్టర్‌ శ్రీహరి, రవి, విజయేందర్‌రెడ్డి, శ్రావణ్‌రెడ్డి, రాజేందర్‌ నాయక్‌, జైపాల్‌ నాయక్‌, నాగరాజుగౌడ్‌, జీవీ శ్రీనివాస్‌, షకీల్‌ పాల్గొన్నారు.

వైద్య కళాశాల రాకతో నాణ్యమైన వైద్యం: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
సంగారెడ్డి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేస్తూ సీఎ కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో మెడికల్‌ కళాశాల కోసం సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందటంతో పాటు స్థానిక విద్యార్థులకు వైద్య, విద్య అందుబాటులోకి వస్తున్నదన్నారు. కళాశాల మంజూరు కావడానికి కృషి చేసిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిది

ట్రెండింగ్‌

Advertisement