e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు కల్తీలపై కన్నెర్ర!

కల్తీలపై కన్నెర్ర!

కల్తీలపై కన్నెర్ర!

నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై పీడీ యాక్టు
సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు సభ్యులతో టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ ఏర్పాటు
కలుపు నివారణ, హట్‌కాటన్‌ విత్తనాలు, మందులపై నిషేధం
వానకాలంలో అధికారుల సలహా మేరకే విత్తనాలు కొనాలి
కల్తీలని తెలిస్తే టాస్క్‌ఫోర్స్‌కు సమాచారమివ్వాలి
రైతులకు సూచిస్తున్న అధికారులు

రైతులకు కల్తీ విత్తనాలు అంటగట్టి మోసం చేసే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, దుకాణాదారుల భరతం పట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వానకాలం సమీపిస్తుండడంతో మార్కెట్లో నకిలీ విత్తనాలు, కలుపు నివారణ మందులు, గడ్డి విత్తనాలు విక్రయించే అవకాశం ఉందని, కొనుగోలు సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుల నష్టపోకుండా ముందు జాగ్రత్త చర్యగా సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ నకిలీలపై చర్యలు తీసుకోనుంది. టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందించేందుకు ఫోన్‌ నంబర్లను సైతం అందుబాటులో ఉంచారు. నకిలీ విత్తనాల తయారీదారులు, అంటగట్టే వారిపై పీడీ యాక్టు, సీడ్స్‌ యాక్టు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నారు.

సంగారెడ్డి, మే 15 : మట్టితల్లిని నమ్ముకుని జీవించే అన్నదాతలను మోసగించేందుకు కల్తీ విత్తనాలు అమ్ముతుంటారు కొంతమంది డీలర్లు. రానున్న వాన కాలంలో విత్తనాలు విత్తే సమయానికి అన్నదాతలను మోసగించి లబ్ధి పొందడానికి కొంతమంది డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు నోర్లు తెరుచుకుని చూస్తున్నారు. ఇలాంటి కల్తీ విత్తనాలు, కలుపు నివారణ మం దులు, గడ్డి విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. కల్తీ విత్తనాలు, మం దులు కొనుగోలు చేసి మోసపోవద్దని అధికారులు రైతులను చైతన్య పరుస్తున్నారు. రైతులను అప్రమత్తం చేసి కల్తీ విత్తనాల నుంచి కాపాడేందుకు సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దీనికోసం ముగ్గురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. కల్తీ విత్తనాలు, హట్‌కాటన్‌ పత్తి విత్తనాలు, కలుపు నివారణ మం దుల కొనుగోలులో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కల్తీలు అమ్ముతున్నట్లు అన్నదాతల కంట పడగానే వెంటనే టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌కు సమాచారం అందించేందుకు ఫోన్‌ నంబర్లను సైతం అందుబాటులో ఉంచారు. వానకాలం 2021 సీజన్లో రైతు లు కల్తీ విత్తనాలతో మోసపోకుండా, కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, తయారీ పరిశ్రమలపై తనిఖీలు నిర్వహిస్తారు. ఐపీసీ-420, ఈసీ యాక్టు-1955, పీడీ యాక్టు, సీడ్స్‌ యాక్టుల లాంటి కేసులు నమోదు చేసి వారిపై చట్టరీత్యా చర్యల నిమిత్తంపై అధికారులకు సిఫారసు చేయనున్నారు. రాబో యే వానకాలంలో రైతులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే లైసెన్స్‌ కలిగి ఉన్న డీలర్‌ దగ్గర కొనుగోలు చేసి, రసీదు పొందాలి. మోసగాళ్ల నుంచి పత్తి విత్తనాలు కొనుగోలు చేయొద్దని, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారాన్ని అందించి మోసగాళ్ల నుంచి రైతులు మోసపోకుండా కాపాడుకోవాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
హట్‌కాటన్‌ విత్తనాలు అమ్మితే నేరం..
మార్కెట్‌లో గడ్డి మందును తట్టుకునే పత్తి (హెర్బిసైడ్‌ టోలరెంట్‌) విత్తనాలు అమ్మితే నేరమని, ప్రభు త్వ అనుమతి లేనందున అలాంటి విత్తనాలు అమ్మి నా, రైతులు కొని పొలంలో విత్తినా చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విత్తనాలు అమ్ముతున్నట్లు ఎక్కడైనా కనిపించినా, తెలిసినా వెం టనే టాస్క్‌ ఫోర్సు టీమ్‌ అధికారులకు లేదా మండల వ్యవసాయ అధికారి, సహాయ వ్యవసాయ అధికారులకు సమాచారాన్ని ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తే వారిపై అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అలాగే, ైగ్లెఫోసేట్‌ అనే కలుపునివారణ మందును అమ్మడం, కొనడం, వాడటాన్ని జీఓ నెంబర్‌ 239, తేదీ 5-5-2021 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. రైతులు నష్టపోకుండా కాపాడుకోవాలని, ైగ్లెఫోసేట్‌ అనే గడ్డి మందును ఎవరైనా అమ్ముతున్నట్లు తెలి స్తే అధికారులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. వానకాలం సీజన్‌-2021 సాగు చేసే రైతులకు కావాల్సిన ఎరువులు, యూరి యా, డీఏపీ, కాంప్లెక్స్‌లను మండలాల వారీగా గ్రామాల్లో రైతాంగానికి అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, ఏఆర్‌ఎస్‌కేలతో సరఫరా చేయనున్నారు. రైతులు విత్తనాలు విత్తే సమయానికి ఎరువులకు ఎలాంటి కొరత లేకుం డా సకాలంలో అందేలా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. అన్నదాతలు ఎరువుల కోసం ఆం దోళన చెందాల్సిన అవసరం లేకుండా వ్యవసాయాధికారులు ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు.

కల్తీలపై టాస్క్‌ఫోర్స్‌ డేగ కన్ను
ప్రభుత్వం కల్తీ విత్తనాలపై కన్నెర్ర చేస్తున్నది. అన్నదాతను మోసం చేస్తే సహించేదిలేదని ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ము గ్గురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది. కల్తీ విత్తనాలు, కలుపు నివారణను తట్టుకునే పత్తి విత్తనాలపై టాస్క్‌ఫోర్స్‌ ఇక నుంచి డేగ కండ్లతో నిఘా పెట్టనున్నది. ఎక్కడైనా కల్తీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లో జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాస్‌ ప్రసాద్‌ (7288894402) ఫోన్‌ నెంబర్‌, విత్తన ధ్రువీకరణ అధికారి నగేశ్‌ (72888 79655), జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ కృష్ణయ్య (80080 45736) ఫోన్‌ నెంబర్లకు సమాచారం అందించాలి.

  • నర్సింగరావు,
    జిల్లా వ్యవసాయాధికారి, సంగారెడ్డి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కల్తీలపై కన్నెర్ర!

ట్రెండింగ్‌

Advertisement