e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు మాస్క్‌లు వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి

మాస్క్‌లు వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి

మాస్క్‌లు వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి

బొల్లారం, మే 8 : ఇతరుల నుంచి మనకు కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే మాస్క్‌ ధరించడం తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడు కూడా మాస్క్‌ ధరించే వెళ్లాలని ఆరోగ్య శాఖ నిపుణులు సూచిస్తున్నారు. రెండు మాస్క్‌లు వాడితే ఇంకా మంచిదని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో మాస్క్‌లు వాడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం…

ఎలాంటి మాస్క్‌లు ఎంచుకోవాలి ?

సర్జికల్‌ మాస్క్‌ అయినా క్లాత్‌ మాస్క్‌ అయినా 3 లేయర్లు ఉన్నవే ఎంచుకోవాలి.
బట్ట మాస్క్‌లను తీసుకోవాలనుకుంటే సులభంగా శ్వాస తీసుకునేందుకు వీలు ఉండే మాస్క్‌లు తీసుకోవాలి.
మాస్క్‌ మీ ముఖాన్ని మొత్తం కవర్‌ చేసేలా ఉండాలి. అంటే ముక్కు, నోరు, గడ్డం భాగం పూర్తిగా కవర్‌ అయ్యేలా ఉండాలి.
ముక్కు దగ్గర స్ట్రిప్‌ ఉన్న మాస్క్‌లను వాడటం మంచిది. ఈ స్ట్రిప్‌ ఉండటంతో బయట గాలిని మనం పీల్చుకోకుండా జాగ్రత్త పడొచ్చు.
రెండేళ్లలోపు చిన్నారులకు మాస్క్‌ అవసరం లేదు. రెండేళ్లు దాటిన చిన్న పిల్లలకు బట్ట మాస్క్‌ను ఎంచుకుంటే వారి ముఖానికి బిగుతుగా ఉండేలా చూసుకోవాలి.

పాటించాల్సిన జాగ్రత్తలు

మాస్క్‌ పెట్టుకునే ముందు తీసిన తర్వాత కచ్చితంగా చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి.
మాస్క్‌ పెట్టుకునేటప్పుడు లేదా తీసేటప్పుడు కేవలం మాస్క్‌కు ఉన్న దారాన్ని మాత్రమే పట్టుకోవాలి. మాస్క్‌ను పట్టుకోకూడదు.
తరచూ మాస్క్‌ను పట్టుకోవడం కూడా మంచిది కాదు. ఎప్పుడైనా మాస్క్‌ను పట్టుకోవాలన్న చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి.
మనం పెట్టుకునే మాస్క్‌ కచ్చితంగా ముక్కు, నోరు, గడ్డం భాగం కవర్‌ చేయాలి. ముఖానికి సరిపోయేలా ఫిట్‌గా ఉండాలి.
ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ పెట్టుకుంటే…తిరిగి ఇంటికి వచ్చే వరకు మాస్క్‌ తీయొద్దు.
వాడిన మాస్క్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఒకసారి మాస్క్‌ను ఉపయోగించిన తర్వాత డెటాల్‌ వేసిన వేడి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత మాస్క్‌ను ఉతికి ఎండలో ఆరేయాలి. ఉతికాం కదా అని ఒకరి మాస్క్‌ మరొకరు వాడకూడదు.
బట్టతో తయారు చేసిన మాస్క్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలంలో మాస్క్‌ ధరించినప్పుడు చెమట పట్టేస్తుంది. బట్ట మాస్క్‌లు తొందరగానే చెమటను పీల్చేస్తాయి. కాకపోతే అలా చెమటతో నిండి న మాస్క్‌లతో అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. చెమటతో తడిచిన మాస్క్‌లపై క్రిములు, బాక్టీరియా కూడా త్వరగా చేరతాయి. కాబట్టి చెమట పట్టిన మాస్క్‌లను వెంటనే తీసేయాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాస్క్‌లు వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి

ట్రెండింగ్‌

Advertisement