e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home సంగారెడ్డి భూపాల్‌రెడ్డిని సన్మానించిన జిల్లా ప్రజాప్రతినిధులు

భూపాల్‌రెడ్డిని సన్మానించిన జిల్లా ప్రజాప్రతినిధులు

భూపాల్‌రెడ్డిని సన్మానించిన జిల్లా ప్రజాప్రతినిధులు

సంగారెడ్డి, జూన్‌ 4 (నమస్తే తెలంగాణ)/ రామచంద్రాపురం/అందోల్‌/నారాయణఖేడ్‌ : శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన వెన్నవరం భూపాల్‌రెడ్డికి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొ రేటర్లు, ఇతర ప్రజాప్రతి నిధులు శుభాకాం క్షలు తెలియజేశారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీ దుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు జైపాల్‌రెడ్డి హైదరా బాద్‌లో భూపాల్‌రెడ్డిని కలిసి సన్మానించి శుభా కాంక్షలు తెలియజేశారు.

నిబద్ధతతో నిర్వర్తిస్తాను: ప్రొటెం చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌రెడ్డి
శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెన్నవరం భూపాల్‌రెడ్డి మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రు లు కేటీఆర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు. నిత్యం ప్రజాప్రతినిధులు, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. అనంతరం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళి సైని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

జిల్లా నేతల నుంచి శుభాకాంక్షల వెల్లువ..
శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా వెన్నవరం భూపాల్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక నాయకులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్‌, మెట్టుకుమార్‌యాదవ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మల్లారెడ్డి, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్‌ శ్రీశైలం, మాజీ కార్పొరేటర్‌ అంజయ్య, నాయకులు నగేశ్‌, సోమిరెడ్డి, ప్రమోద్‌గౌడ్‌, నర్సింహ, పరమేశ్‌యాదవ్‌, కొలన్‌ బాల్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డితోపాటు జిల్లా నాయకులు భూపాల్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భూపాల్‌రెడ్డిని సన్మానించిన జిల్లా ప్రజాప్రతినిధులు

ట్రెండింగ్‌

Advertisement