కంది/సంగారెడ్డి : జిల్లా జైలును ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆప్పీ పట్నాయక్ గురువారం సందర్శించారు. తాను స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో అవసరమైన జైలు సన్నివేశాలకు సంబంధించిన ఇక్కడికి వచ్చారు.
జిల్లా జైలును సందర్శించిన ఆయన ఇక్కడ జైలు అందంగా పార్క్‌లా ఉందన్నారు. సంగారెడ్డిలోని పాత జైలుకు కూడా వెళ్లివచ్చిన ఆయన అక్కడ షూటింగ్‌కు ఓపెన్ ఉండడంతో కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. జైలుకు వచ్చిన పట్నాయక్‌తో స్థానిక సిబ్బంది కలిసి సెల్ఫీదిగారు.