బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Sep 01, 2020 , 00:33:17

ప్రజాసమస్యలను గుర్తించి పరిష్కరించాలి

ప్రజాసమస్యలను గుర్తించి పరిష్కరించాలి

మణికొండలో సెంట్రల్‌పోల్‌ లైటింగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

మణికొండ, ఆగస్టు 31: ప్రజావసరాలను గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మణికొండ మున్సిపాలిటీ నాల్గవవార్డులో సెంట్రల్‌పోల్‌ లైటింగ్‌ సిస్టం, రోడ్డు డివైడర్‌ పనులను ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మణికొండ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రధానమైనదన్నారు.  ఆయా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, కమిషనర్‌ జయంత్‌, డీఈ సాజిత్‌, ఏఈ విటోబా, కౌన్సిలర్లు వందన, కె.రామకృష్ణారెడ్డి, పి.శైలజ, ఆంజనేయులు, పద్మారావు, కోఆప్షన్‌ సభ్యులు సిద్ధప్ప, మాజీ సర్పంచ్‌ వై.నరేశ్‌, మాజీ ఉపసర్పంచ్‌ నాగేశ్‌, నాయకులు కృష్ణకుమార్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo