న్యాల్కల్ : మండలంలోని హద్నూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగుపోస్తుండటంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూడేండ్ల తర్వాత చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తుండటంతో పరిసర గ్రామాల పరిధిలో భూగర్భజలాలు పెరిగి తాగు, సాగుకు ఇబ్బందులుండవని రైతులు, గ్రామస్తులు పేర్కొంటున్నారు.