e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జిల్లాలు సంగారెడ్డి ఎస్పీగా రమణకుమార్‌

సంగారెడ్డి ఎస్పీగా రమణకుమార్‌

రామగుండం కమిషనర్‌గా చంద్రశేఖర్‌కు పోస్టింగ్‌
ఐదేండ్ల కాలంలో ఎస్పీగా తనదైన ముద్ర
సంగారెడ్డి ఎస్పీగా ఉండగానే డీఐజీగా పదోన్నతి
జిల్లాలో పనిచేయడం సంతృప్తినిచ్చింది : చంద్రశేఖర్‌రెడ్డి

సంగారెడ్డి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బదిలీ అయ్యారు. రామగుండం కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు నూతన ఎస్పీగా ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రమణకుమార్‌ను ప్రభుత్వం నియమించింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రశేఖరెడ్డి ఐదేళ్లపాటు సంగారెడ్డి ఎస్పీగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎస్పీగా చంద్రశేఖర్‌రెడ్డి 23 మే, 2016లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లాల పునర్విభజన అనంతరం సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చంద్రశేఖర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఐదేళ్లపాటు ఎస్పీగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించారు. సంగారెడ్డి ఎస్పీగా ఉన్న క్రమంలోనే చంద్రశేఖర్‌రెడ్డి డీఐజీగా పదోన్నతి పొందారు. 4 జనవరి, 2019లో డీఐజీగా పదోన్నతి లభించింది. ఎస్పీగా ఆయన పాలనలో జిల్లాలో అన్నిరకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. మహిళలపై దాడులు, ఈవ్‌టీజింగ్‌ తగ్గేందుకు భరోసా కేంద్రాలు, షీటీమ్స్‌ ద్వారా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కృషి చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా ముగిసేలా చర్యలు తీసుకున్నారు. 2018లో సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం జరిగేలా చూశారు. అలాగే 2019లో జరిగిన మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఆ తర్వాత జరిగి జిల్లా పరిషత్‌, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. కొవిడ్‌ సమయంలో జిల్లాలో లాక్‌డౌన్‌ సమర్థవంతంగా అమలయ్యేలా చూశారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్వయంగా జిల్లా అంతటా కలియతిరుగుతూ లాక్‌డౌన్‌ విజయవంతం అయ్యేలా చూశారు. కరోనాకు గురైన పోలీసు సిబ్బందికి సకాలంలో చికిత్స అందేలా చొరవ తీసుకుని సిబ్బంది మన్ననలు పొందారు. ఇదిలా ఉంటే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వచ్చే ఏడాది జనవరిలో ఐజీగా పదోన్నతి పొందనున్నట్లు సమాచారం.


జిల్లాలో పనిచేయటం సంతృప్తినిచ్చింది..

  • చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ
    ఉమ్మడి మెదక్‌ జిల్లా, సంగారెడ్డి జిల్లా ఎస్పీగా సేవలు అందించటం ఎంతో సంతోషంగా ఉం దని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ‘నమస్తే తెలంగాణ’తో ఆయ న మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా ఐదేండ్లు పనిచేయటం సంతృప్తిగా ఉందన్నారు. ఎస్పీగా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసినట్లు చెప్పారు. నేరాలు అదుపులోకి తీసుకురావటంతోపాటు మహిళలపై దాడులు అరికట్టినట్లు చెప్పారు. గజ్వేల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీగా సెక్యూరిటీ బాధ్యతలు చూడాల్సి ఉండటంతో కొంత టెన్షన్‌ పడినట్లు చెప్పారు. ప్రధాని పర్యటన ప్రశాంతంగా ముగియటం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. నిమ్జ్‌ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసేలా చూసినట్లు చెప్పారు. ఎస్పీగా నాకు అది మరువలేని జ్ఞాపకమన్నారు. కొవిడ్‌ సమయంలో పోలీసు సిబ్బందికి సకాలంలో వైద్య సేవలు అందించటం సంతృప్తినిచ్చినట్టు తెలిపారు.
    త్వరలో విధుల్లో చేరతా..
  • ఎం.రమణకుమార్‌, నూతన ఎస్పీ
    సంగారెడ్డి జిల్లా ఎస్పీగా త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తానని నూతన ఎస్పీగా నియామకమైన రమణకుమార్‌ తెలిపారు. ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రమణకుమార్‌ సంగారెడ్డి జిల్లా ఎస్పీగా నియమితులైన విషయం తెలిసిందే. ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు తనకు అందాయని, త్వరలోనే జిల్లా ఎస్పీగా విధుల్లో చేరతానని చెప్పారు. నూతన ఎస్పీగా నియామకమైన రమణకుమార్‌ పోలీసు శాఖలో వేర్వేరు హోదాల్లో హైదరాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా హైదరాబాద్‌లో ఉన్న ఆయనను ప్రభుత్వం సంగారెడ్డి ఎస్పీగా నియమించింది.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana