బుధవారం 03 మార్చి 2021
Sangareddy - Feb 23, 2021 , 03:16:15

ఒకే యాప్‌లో.. అన్నీ

ఒకే యాప్‌లో.. అన్నీ

  • పాఠశాల స్థాయి నుంచి సివిల్స్‌ వరకు పోటీ పరీక్షల సన్నద్ధం కోసం.. 
  • కేవలం రూ.99కే యాప్‌   అందుబాటులో..
  • రూపొందించిన వాణీకుమారి

సంగారెడ్డికి చెందిన వాణీకుమారి రూపొందించిన కాల్కస్‌ ఇండియా అనే యాప్‌లో 3వ తరగతి నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ వరకు దేశంలోని అన్ని ప్రముఖ బోర్డు పరీక్షల నుంచి 8607 టెస్ట్‌లను ప్రాక్టీస్‌ చేయవచ్చు. అంతేకాకుండా సివిల్స్‌, పోలీస్‌ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా ప్రత్యేక బండిల్‌ రూపంలో అన్ని రకాల ప్రశ్నాపత్రాలతో పాటు పూర్తి జవాబులను పొందుపర్చారు. ఇంట్లోనే ఉంటూ పలు కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అయ్యేలా పలు విభాగాలకు చెందిన ప్రశ్నాపత్రాలను జవాబులతో కలిపి బండిల్‌ రూపంలో కేవలం రూ. 99కే అందిస్తున్నారు. అనంతరం ఎంతవరకు ప్రిపేర్‌ అయ్యామో నైపుణ్యతను కూడా యాప్‌ ద్వారా పరీక్షించుకోవచ్చు. 

1324 విభాగాలతో 42 వేల ప్రాక్టీస్‌ టెస్ట్‌లు  

కాల్కస్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో రూపొందించిన కాల్కస్‌ ఇండియా యాప్‌లో మొత్తం 1324 విభాగాలతో 42 వేల ప్రాక్టీస్‌ టెస్ట్‌లతో కూడిన 25 బండిళ్లను  అందుబాటులో ఉంచారు. ఇందులో రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు పరిమిత సంఖ్యలో పేపర్లను ఉచితంగా ప్రాక్టీస్‌ చేసుకునేలా తీర్చిదిద్దారు. రూ. 99కే సబ్‌స్కైబ్‌ చేసుకున్న అభ్యర్థులు ఒక బండిల్‌లో ఉన్న అన్ని రకాల పరీక్షలను సంవత్సర కాలం పాటు ప్రాక్టీస్‌ చేసుకునేలా యాప్‌లో పొందుపర్చారు. 

అన్ని రకాల సిలబస్‌లు అందుబాటులో..

కాల్కస్‌ ఇండియా యాప్‌లో అన్ని రకాల సిలబస్‌లను పొందుపర్చారు. ఇందులో సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీ, కేవీపీవై (కిషోర్‌ విజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన), ఎన్‌పీఓ (నేషనల్‌ సైబర్‌ ఒలంపియాడ్‌), సీబీఎస్‌పీ -వీబీక్యూ, సీబీఎస్‌సీ ఆప్టిట్యూడ్‌, ఎంటీఎస్‌సీ, హెచ్‌బీబీవీఎస్‌, సైనిక్‌ స్కూల్‌ ఎంట్రె న్స్‌, జవహర్‌ నవోదయ ఎంట్రెన్స్‌, ఎస్‌ఓఎఫ్‌ ఎన్‌ఎస్‌ఓ) ఇంగ్లిష్‌ ఒలంపియాడ్‌, సైన్స్‌ ఒలంపియాడ్‌ ఫౌండేషన్‌-నేషనల్‌ సైన్స్‌ ఒలంపియాడ్‌) వంటి సిలబస్‌లను ఈ యాప్‌లో పొందుపరిచినట్లు వ్యవస్థాపకురాలు వాణికుమారి తెలిపారు. 

 తక్కువ ధరకే అందరికీ చేరువలో.. 

కాల్కస్‌ ఇండియా యాప్‌ను తక్కువ ధరకే అందుబాటులో కి  తెచ్చాం. ఈ యాప్‌లో పాఠశాలలోని అన్ని తరగతుల వారితో పాటు  సవి ల్స్‌, గ్రూప్స్‌ అభ్యర్థులు యాప్‌లో పరీక్షలను ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆపై వేర్వేరు తరగతులు చదువుతున్నా కేవలం రూ. 99తో సబ్‌స్రైబ్‌ చేసుకుంటే అన్ని తరగతులకు చెందిన ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ కావచ్చు. దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌లో కాల్కస్‌ ఇండియా అని టైప్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.calcusindia.comను సందర్శించవచ్చు.

- వాణీకుమారి, కాల్కస్‌ ఇండియా ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ వ్యవస్థాపకురాలు 

VIDEOS

logo