దర్శక ధీరుడు రాజమౌళి వర్క్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన ఓటమని రుచించలేదు. తీసిన ప్రతి సినిమా భారీ హిట్ కాగా, బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది.
సెకండ్ వేవ్‌కు ముందు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కాని కరోనాతో అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని అభిమానులు ఊహించారు. కాని పలు అకేషన్స్ సందర్భంగా మూవీల నుండి పలు పోస్టర్స్ విడుదల చేస్తుండగా, అందులో విడుదల తేదీ అక్టోబర్ 13 అనే ఉంచారు. తాజాగా రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణినేజన్మదినం సందర్భంగా తమ చిత్ర యూనిట్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
అవైటెడ్ బిగ్గెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అయినటువంటి “ఆర్ఆర్ఆర్” పాటలను అతి త్వరలోనే విడుదల చేయనున్నామని తెలుపుతూ పోస్టర్ లోనే ఈ చిత్రం రిలీజ్ డేట్ “అక్టోబర్ 13” నే అని మళ్ళీ పొందుపరిచారు. దీనితో రాజమౌళి కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.