గురువారం 04 మార్చి 2021
Sangareddy - Jan 28, 2021 , 00:28:07

గురుకులాలు సిద్ధం

గురుకులాలు సిద్ధం

  • ప్రారంభానికి సిద్ధమైన వసతి గృహాలు, కేజీబీవీలు 
  • సంగారెడ్డి జిల్లాలో 98 హాస్టళ్లు, రెసిడెన్షియల్స్‌
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • ఫిబ్రవరి 1 నుంచి తెరిచేందుకు సన్నాహాలు
  • హాస్టళ్లల్లో మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరి

ప్రభుత్వ ఆదేశాలతో ఫిబ్రవరి 1 నుంచి సంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనుండగా, హాస్టళ్లు, గురుకులాలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా కారణంగా 2020 మార్చి నెలలో మూతపడిన వాటిని శుభ్రం చేసి, శానిటైజేషన్‌ చేశారు. నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హాస్టళ్లను శుభ్రం చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థులు, బోధకులు, సిబ్బంది మాస్క్‌లు ధరించి, శానిటైజర్లు ఉపయోగిస్తూ, భౌతిక దూరం పాటించేలా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. సంగారెడ్డి జిల్లాలో షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమశాఖ ద్వారా 37 హాస్టళ్లు, ఎస్టీ సంక్షేమశాఖ ద్వారా 13 హాస్టల్స్‌, వెనుకబడిన సంక్షేమశాఖ ద్వారా 34 హాస్టళ్లు ఉండగా, మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా 14 మైనార్టీ గురుకుల పాఠశాలలున్నాయి. 17 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. ఆయా హాస్టళ్లు, గురుకులాలు, కళాశాలలు, వసతి గృహాలను ప్రారంభానికి సిద్ధం చేశారు.

- సంగారెడ్డి టౌన్‌ (జనవరి 27)

సంగారెడ్డి టౌన్‌ (జనవరి 27) : ప్రభుత్వ ఆదేశాలతో ఫిబ్రవరి 1నుంచి జిల్లాలో ఉన్న పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనుండగా హాస్టళ్లు, రెసిడెన్షియల్స్‌ను ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమశాఖ ద్వారా 37 హాస్టళ్లు ఉన్నా యి. అందులో 28 బాలుర, 9 బాలికలు ఉన్నాయి. వాటి లో మొత్తం 3194మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా 13 హాస్టళ్లు ఉండగా అందులో 2188మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లా వెనుకబడిన సంక్షేమశాఖ ద్వారా 34 హాస్టళ్లు ఉం డగా అందులో 3186 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా 14 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 17 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో పేద, వెనుకబడినవర్గాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మైనార్టీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహా లు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హాస్టళ్లను శుభ్రం చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. కరోనా కారణంగా గత 2020 మార్చిలో మూతపడిన వాటిని శుభ్రం చేయడంతో పాటు శానిటైజేషన్‌, మరుగుదొడ్లు శుభ్రపర్చడం, విద్యార్థులు బస చేసే రూమ్‌లన్నింటినీ శానిటైజ్‌ చేయనున్నారు. అన్నింటికి స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం, ఫిల్టర్‌ యంత్రాలు, మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్స్‌లలో చాలా రోజులుగా ఫ్యాన్లు వాడకపోవడంతో పాడ య్యే అవకాశం ఉన్నందున వాటికి కూడా మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువస్తారు. 

మాస్క్‌లు..శానిటైజర్లు..భౌతికదూరం తప్పనిసరి..

కేంద్రప్రభుత్వ కరోనా నిబంధనల ప్రకారం హాస్టళ్లలో పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు, వస తి గృహాల నిర్వాహకులు, బోధకులు, సిబ్బంది విధిగా కరోనా నిబంధనలు పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే విద్యార్థులు తదితరులకు మాస్క్‌లు, శానిటైజర్లు మంజూరు చేయడంతో పాటు కనీ సం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. విద్యార్థులు బస చేసే గదులలో కూడా శానిటైజ్‌ చేసుకోవాలి. ప్రతి రో జూ తప్పనిసరిగా సబ్బులతో చేతులు శుభ్రం చేసుకుని ఆహారం తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. హాస్టళ్లు ప్రారంభం రోజున విద్యార్థులకు కరోనా నిబంధనలపై స్పష్టమైన విధివిధానాలను వివరిస్తూ వాటిని పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. పాఠశాలలకు వెళ్లి వచ్చిన వెం టనే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, విధిగా స్నానాలు చేసుకోవడం వంటివి సిబ్బంది పర్యవేక్షించనున్నారు.  జిల్లాలో ఉన్న అన్ని హాస్టళ్లలో తప్పనిసరిగా శానిటైజర్‌, మాస్క్‌లు వాడేలా నిబంధనలు విధించారు. 

విద్యార్థులకు ఇష్టం ఉంటేనే హాస్టళ్లకు..

ఫిబ్రవరి 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా హాస్టళ్లకు విద్యార్థుల ఇష్టం ఉంటేనే రావ చ్చు అనే నిబంధన ఉంది. విద్యార్థులు హాస్టళ్లకు రావాలనుకుంటే తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి పత్రం తీసుకోవాలి. అదే విధంగా నేరుగా హాస్టళ్లకు రాలేకపోయిన వారికి ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు భోదించే వెసులుబాటును కల్పించారు. 

VIDEOS

logo