నెలాఖరు నుంచి పల్స్ పోలియో

- 0-5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు
- సంగారెడ్డి జిల్లాలో 1,63,029 మంది, మెదక్ జిల్లాలో 75,490 మంది చిన్నారుల గుర్తింపు
- ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్న వలంటీర్లు
- జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో వ్యాక్సిన్ వేసే సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్న వైద్యాధికారులు
పోలియో వ్యాధి సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ‘పోలియో వైరస్' క్రిమివల్ల ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తున్నది. ఈ వ్యాధి శరీరంలోని ఏ అవయవాన్నైనా (కాలు, చేయి, మెడ) జీవితాంతం పక్షవాతానికి గురి చేస్తుంది. దానికి చికిత్స అనేది ఉండదు. దీని నుంచి రక్షించుకోవాలంటే నోటి ద్వారా అందించే పోలియో చుక్కలను ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ వేయించాలి. ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి నిరంతరం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ నెల 31నుంచి ఫిబ్రవరి 2వరకు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు.
సంగారెడ్డి టౌన్, జనవరి 27: పుట్టిన పిల్లవాడి నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ (0-5) పల్స్ పోలియో చుక్కలు వేయించి పిల్లల నిండు జీవితాలను తల్లిదండ్రులు కాపాడుకోవాలి. ఇం దుకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో జిల్లా వైద్యాధికారులు వ్యాక్సిన్ వేసే సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో వైద్యాధికారులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా లో 1,63,029 మంది (0-5) సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారు. పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు ప్రాథమిక హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పీపీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కలు వేసేందుకు అందుబాటులో రూరల్, అర్బన్, మొబైల్, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మొత్తం 1,119 కేంద్రాలను గుర్తించారు. పోలియో చుక్కలు వేసేందుకు ఆటోలను ఇసుక బట్టీలు, చెరుకు ఫ్యాక్టరీలు, అపార్ట్మెంట్లలో పని చేసే కూలీలు, వర్కర్ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు.
జిల్లాలో 4,476 మంది వ్యాక్సినేటర్లు..
మొత్తం 4,476 వ్యాక్సినేటర్లు పల్స్ పోలియోలో పాల్గొననున్నారు. ఇందులో హెల్త్ స్టాఫ్, ఆశవర్కర్లు, ఐసీడీఎస్ అంగన్వాడీలు, వలంటరీలు, ఇతర ఎన్జీవో, ఎంఎన్ఆర్ మెడికల్ విద్యార్థులు పాల్గొననున్నారు. రూట్లను ఏర్పాటు చేసి రూట్లకు పీహెచ్సీ సూపర్వైజర్లను ఏర్పాటు చేశారు. ఇందులో డీపీవో, డీఐవో, పీవో (మలేరియా), పీవో (కుష్టు), పీవో (క్షయ), డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వోలు, పీవో (ఐసీడీఎస్)లు పాల్గొననున్నారు. ఈ నెలలో డివిజన్లవారీగా సమావేశాలు నిర్వహించి ఆయా ప్రాంతాల ఎంఈవో, ఎంపీడీవో, ఐకేపీ, ఐసీడీఎస్ సూపర్వైజర్లకు పల్స్‌పోలియో నిర్వహణపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. పల్స్ పోలియోపై సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌లలో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమావేశం నిర్వహించి ఆయా ప్రాంతాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీలు, ఆశలు, ఏఎన్ఎంలకు అవగాహన కల్పించనున్నారు. పల్స్ పోలియో కేంద్రాలలో సమస్యలు, అపోహలు, వ్యాక్సిన్‌కు సంబంధించిన ఇబ్బందులు తెలుసుకునేందుకు జిల్లా కేంద్రం డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. పీహెచ్సీ సెంటర్లలో మెడికల్ అధికారులే కంట్రోల్ అధికారులుగా వ్యవహరిస్తారు. జిల్లావ్యాప్తంగా అన్ని సెంటర్లలో పల్స్ పోలియో వ్యాక్సిన్ సీసాలను అందజేసి సాయంత్రం వరకు రోజువారీగా నమోదైన సమాచారం సేకరించి అధికారులకు అందజేస్తారు. పల్స్‌పోలియో కార్యక్రమం ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వరకు కొనసాగనున్నది. 31వ తేదీన బూత్‌లలో పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. ఫిబ్రవరి 1, 2 తేదీలలో వలంటీర్లు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు.
పల్స్ పోలియోకు సర్వం సిద్ధం
మెదక్ కలెక్టరేట్, జనవరి 27 : మెదక్ జిల్లాలో పల్స్ పోలి యో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 0-5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పల్స్ పోలి యో చుక్కలు వేయనున్నారు. ఆదివారం ఉదయం 7 గం టల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పల్స్ పోలి యో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో 75వేల 490 మంది చిన్నారులను గుర్తించారు. ఇందుకోసం 523 పోలియో డ్రాప్స్ బూతులు ఏర్పాటు చేయగా, 24 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 2184 మంది ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారు. 53 రూట్లల్లో 53 మంది సూపర్వైజర్లు పర్యవేక్షణ చేయనున్నారు. జిల్లాలో 20 పీహెచ్సీలలో 20 మొబైల్ టీం వాహనాల్లో ఇటుక బట్టీలు, స్లమ్ ఏరియాలు, నిర్మాణ ప్రదేశాలకు వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు.
ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఇంటింటికీ పల్స్ పోలియో..
ఆదివారం పోలియో చుక్కలు వేయడంతో పాటు ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో మిగిలిపోయిన చిన్నారులకు ఈ పోలియో చుక్కలను వేయడం జరుగుతుంది. ఈ పోలియోకు సంబంధించిన జిల్లావ్యాప్తంగా మొత్తం 8లక్షల జనాభా ఉండగా 0-5 సంవత్సరాలలోపు చిన్నారులు 75వేల 490 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. కాగా 1,71,423 గృహాలు ఉన్నాయి. ఈ పల్స్ పోలియోలో వైద్య సిబ్బందితోపాటు అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. అయితే ప్రతి ఏడాది రెండుసార్లు ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పోలియో చుక్కలు వంద శాతం వేసేందుకు వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేస్తున్నారు.
పోలియోను తరిమివేయాలి..
తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. ముఖ్యంగా 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. పోలియో వైరస్ క్రిమివల్ల ఈ వ్యాధి సోకుతుంది. పోలియో చుక్కలను వేయించడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. జిల్లాలోని అన్ని బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రదేశాలు, ప్రాథమిక, అర్బన్ ఆరోగ్య కేంద్రాల వద్ద సెంటర్లను ఏర్పాటు చేశాం. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూం 08455-274824 ఏర్పా టు చేశాం.
- మోజీరాం రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, సంగారెడ్డి
ఐదేండ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించాలి
పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్క లు వేయించాలి. ఆదివారం జిల్లావ్యాప్తంగా పల్స్ పోలి యో కార్యక్రమాన్ని నిర్వహి స్తాం. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు చిన్నారులు 75,490 మంది ఉన్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఇంటింటికీ పల్స్ పోలి యో చుక్కలు వేస్తాం. నిర్ధేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించాం.
-డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్‌వో, మెదక్
తాజావార్తలు
- అంబానీ గ్యారేజీకి రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్బ్యాడ్జ్
- మ్యాప్‌మైఇండియా మ్యాప్స్ లో కరోనా టీకా కేంద్రాల సమాచారం
- సుపరిపాలన కోసం క్రిప్టో కరెన్సీ:అనురాగ్ ఠాకూర్
- నీవి ఎల్లప్పుడూ సాస్తీ వ్యాఖ్యలే: తాప్సీపై కంగన ఫైర్
- అక్షర్.. ఆ సన్‌గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?