శనివారం 06 మార్చి 2021
Sangareddy - Jan 27, 2021 , 00:48:44

వనదుర్గకు సింగూరు జలాలు

వనదుర్గకు సింగూరు జలాలు

జెన్‌కో ద్వారా 0.3టీఎంసీలు విడుదల

దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సూచించిన అధికారులు

పుల్కల్‌, జనవరి 26 : సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం (వనదుర్గా ప్రాజెక్టు) ఆయకట్టుకు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా నీటిని వదిలినట్లు నీటిపారుదలశాఖ ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఈ యాసంగిలో ఇప్పటి వరకు మూడు విడుతలుగా 9 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ నీరు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా వదులుతుండటంతో జెన్‌కో అధికారులు నీరు వదిలిన ప్రతిసారి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారని ఏఈ తెలిపారు. ఒకసారి వదిలిన నీరు ఘనపూర్‌ ఆయకుట్టు రైతులకు రెండు తడులకు సరిపోతుంది. ఇదిలా ఉండగా, ఘనపూర్‌ ఆయకట్టుకు నీరు విడిచిన ప్రతిసారి సింగూరు జలవిద్యుత్‌ కేంద్రంలో 0.4 ఎంయూల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని జెన్‌కో ఏడీఈ పాండయ్య తెలిపారు. సింగూర్‌ నీరు విడుదల చేసి నందున మంజీరాతీరం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

VIDEOS

logo