శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sangareddy - Jan 24, 2021 , 00:16:02

రైతు వేదికలతో సంఘటితం

రైతు వేదికలతో సంఘటితం

రైతు వేదికలు చర్చా వేదికలు కావాలి

డిమాండ్‌ ఉన్న పంటలే సాగుచేయాలి 

రైతుబంధు, రైతుబీమా దేశానికే ఆదర్శం

నందిగామ రైతు వేదిక అద్భుతం 

హామీలను నిలబెట్టుకుంటున్నాం 

పటాన్‌చెరు,ఆర్సీపురం, భారతీనగర్‌ డివిజన్ల ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం

పటాన్‌చెరు అన్నిరంగాల్లో ముందుంది

జిల్లా పర్యటనలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు

రైతుల సంఘటితానికే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని, రైతు వేదికలు చర్చావేదికలు కావాలని, రైతులు లాభదాయక పంటలు సాగుచేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. రైతులు పామాయిల్‌ సాగుకు ముందుకు రావాలన్నారు. కూరగాయలు, పండ్లు, పూల తోటలు సాగుచేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీనగర్‌, పటాన్‌చెరు, ఆర్సీపురం డివిజన్ల ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని, ఈ డివిజన్ల ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి తెలిపారు.

          -పటాన్‌చెరు/ రామచంద్రాపురం, జనవరి 23

రైతు వేదికలు..అన్నదాత కేంద్రాలు కావాలి

పటాన్‌చెరు, జనవరి 23 : ‘దేశంలో ప్రతి వృత్తికి, వర్గానికి సంఘాలున్నాయి. కానీ రైతులకు ఎక్కడా సంఘాలు(వేదికలు) కానరావు.. అందుకే తెలంగాణ సర్కార్‌ రైతులను సంఘటితం చేసే లక్ష్యంతో రైతువేదికలను ఏర్పాటు చేస్తున్నది. రైతు వేదికలు చర్చావేదికలు కావాలి. దేశానికి అన్నంపెట్టే అన్నదాత కేంద్రాలు కావాలి’ అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో రైతువేదికను ప్రారంభించారు. నందిగామలో రూ.కోటి ఖర్చుతో నిర్మిస్తున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. పల్లె ప్రకృతినాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 2,605 రైతువేదికలు నిర్మిస్తున్నామన్నారు. రైతులు తమ భవితను తీర్చిదిద్దుకునే కేంద్రాలుగా మారాలని కోరారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తారన్నారు. పటాన్‌చెరులో నిర్మించిన రైతు వేదికలు అద్భుతంగా ఉన్నాయన్నారు. నందిగామ రైతువేదిక జిల్లాకే ఆదర్శంగా ఉందని కొనియాడారు. జడ్పీటీసీ సుప్రజవెంకట్‌రెడ్డి దంపతుల శ్రమ రైతువేదిక నిర్మాణంలో కనిపిస్తున్నదన్నారు. 

మినీ ఇండియాలో వ్యవసాయానికి ప్రోత్సాహం:  ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

పటాన్‌చెరు అంటేనే మినీ ఇం       డియా అని, ఇక్కడ పరిశ్రమలతో పాటు వ్యవసాయం ఉండటం గొప్పవిషయమని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అన్నా రు. రైతులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు పం టపొలాలు అమ్ముకోకుండా వ్యవసాయాన్ని నమ్ముకోవాలని సూచించారు. సీఎం ప్రోత్సాహంతో సన్నబియ్యం వేసిన రైతులను బీజేపీ నేతలు మద్దతు ధర రాదని బెదిరించారన్నారు. ఇప్పుడు సన్నబియ్యానికి మంచి ధర ఉందన్నారు.

రైతుల కోసమే.. : ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి

నందిగామలోని రైతు వేదికను మనసుతో కట్టారు కాబట్టీ ఇంత చూడచక్కగా ఉందని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసమే పని       చేస్తుందన్నారు. రైతువేదికల ద్వారా చర్చించి మంచి పంటలను పండించాలని కోరారు. 

రైతులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

నియోజకవర్గంలోని రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. నందిగామ రైతు వేదిక ఆదర్శంగా నిర్మించారన్నారు. మిషన్‌ కాకతీయలో అనేక చెరువులను బాగు చేసుకున్నామన్నారు. రైతువేదికలు రైతులకు దిక్సూచి చూపాలని కోరుకున్నారు. 

మా గ్రామానికి కేంద్రం : జడ్పీటీసీ సుప్రజవెంకట్‌రెడ్డి

తమ గ్రామానికి రైతువేదిక కేంద్రంగా మారాలని జడ్పీటీసీ సుప్రజవెంకట్‌రెడ్డి అన్నారు. రైతువేదికను రైతులకోసం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌, డంపింగ్‌యార్డ్‌, ఫంక్షన్‌హాల్‌, హెల్త్‌ సెంటర్‌లకు అందరి సహకారం కావాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, అడిషన్‌ కలెక్టర్‌ వీరారెడ్డి, శివకుమార్‌, డీఎస్పీ భీంరెడ్డి, సర్పంచ్‌ ఉమవతిగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, చిట్టి దేవేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ సుష్మశ్రీవేణుగోపాల్‌రెడ్డి, అమీన్‌ఫూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హారికవిజయ్‌కుమార్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ కుమార్‌గౌడ్‌, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, కొలన్‌బాల్‌రెడ్డి,  ఎంపీటీసీ నాగజ్యోతిలక్ష్మన్‌, మన్నెరాజు, ఉప సర్పంచ్‌ శ్రీశైలం, తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి ఉష తదితరులు పాల్గొన్నారు. 

రూ.1.60 కోట్లతో థీమ్‌పార్కు

పటాన్‌చెరు పట్టణంలోని ఎంజీ రోడ్డులో  రూ. 1.60 కోట్లతో నిర్మిస్తున్న గాంధీ థీమ్‌పార్క్‌కు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలతో కలసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్‌లు శంకర్‌యాదవ్‌, కుమార్‌యాదవ్‌, పుష్పానాగేశ్‌, ఎంపీపీ సుష్మశ్రీ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హారిక విజయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

తడిపొడి చెత్త నిర్వహణపై  ఆగ్రహం

కలెక్టర్‌ గారూ.. ఇదేం నిర్వహణ అని ప్రశ్నించిన మంత్రి

పటాన్‌చెరు : నందిగామ రైతువేదిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అదే ఆవరణలో ఉన్న డంపింగ్‌యార్డును పరిశీలించారు. అక్కడ తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేయకుండా ఒకే చోట పెట్టడంపై  మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ గారూ.. ఇదేం నిర్వహణ ప్రశ్నించారు.


మాట ఇచ్చాం..నిలబెట్టుకుంటాం..


రామచంద్రాపురం : బల్దియా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో డివిజన్‌ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు శనివారం భారతీనగర్‌ డివిజన్‌లోని హెచ్‌ఐజీ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో కార్పొరేటర్‌ సింధూఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వివిధ శాఖల అధికారులతో సమీక్ష  నిర్వహించారు. ముందుగా మిషన్‌భగీరథ చీఫ్‌ ఇంజినీరింగ్‌ చక్రవర్తితో హెచ్‌ఐజీ, విద్యుత్‌నగర్‌, ఎంఐజీ, మ్యాక్‌సొసైటీలోని నీటి సమస్యపై చర్చించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్సీపురంలోని 175 సర్వేనంబర్‌లోని 18 గుంటల ప్రభుత్వ స్థలంలో ఇండోర్‌ స్టేడియాన్ని నిర్మించాలని కార్పొరేటర్‌ అంజయ్య, ఆర్‌ఆర్‌నగర్‌ కాలనీవాసులు మంత్రిని కోరడంతో సానుకూలంగా స్పందించారు. 

రాయసముద్రాన్ని విజిట్‌ చేస్తాం

ఆర్సీపురం డివిజన్‌లోని రాయసముద్రం చెరువుని త్వరలో విజిట్‌ చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెరువు సుందరీకరణకు రూ.10.5కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. చెరువులో గుర్రపుడెక్క తొలగింపు పనులు మాత్రమే జరిగాయి. వాకింగ్‌ ట్రాక్‌, చిల్డ్రన్‌ పార్కు పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ విషయాన్ని సమావేశంలో మంత్రి హరీశ్‌రావు దృష్టికి వచ్చింది. అయితే సమీక్ష సమావేశానికి బల్దియా ఇరిగేషన్‌ అధికారులు రాకపోవడంతో జోనల్‌ కమిషనర్‌ రవికుమార్‌కు ఈ సమస్యపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. భారతీనగర్‌లోని ఎల్‌ఐజీలో రైతుబజార్‌ అభివృద్ధికి రూ.3.5కోట్లు మంజూరయ్యాయని, పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలని జోనల్‌ కమిషనర్‌కు సూచించారు.  సిద్దిపేట తరహాలో రైతుబజార్‌లో వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌లను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని సూచించారు.

స్ట్రాంవాటర్‌ డ్రైన్‌కు శంకుస్థాపన..

భారతీనగర్‌ డివిజన్‌లోని హెచ్‌ఐజీ కాలనీలో రూ.1.20కోట్లతో నిర్మించనున్న స్ట్రాంవాటర్‌ డ్రైన్‌ పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్‌ సింధూఆదర్శ్‌రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. 

పాడైన వస్తువులు భూమిలో పాతేయండి

సంగారెడ్డి చౌరస్తా, జనవరి 23: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9,10వ తరగతులు, ఆపై చదువులకు సంబంధించి విద్యా సంస్థలు పున:ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు తాజా అందించే బియ్యం, కూరగాయలు ఇతర వస్తువులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో విద్యా, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎంపీడీవోలు, రెవెన్యూ, ఎంపీపీ, జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు, ప్రత్యేకాధికారులతో విద్యా సంస్థల పున:ప్రారంభంపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిత్యావసర వస్తువులను యథావిధిగా తెప్పించుకోవాలని పేర్కొన్నారు.పాడైన వస్తువులను భూమిలో పాతేయాలని, వాటిని ఎవరికి ఇవ్వొద్దని, జంతువులకు కూడా వేయవద్దని సూచించారు. విద్యాసంస్థలను శానిటైజేషన్‌ చేయాలన్నారు. మండలంలోని ఎంపీడీవో, ఎంపీవో, తహసీల్దార్‌, ఎంఈవో, మండల ప్రత్యేకాధికారులు మండలంలోని గ్రామాలను ఐదు భాగాలుగా విభజించి పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం కోసం సన్న బియ్యం, ఇతర దినుసులు ఈ నెల 28లోగా అన్ని పాఠశాలలు, హాస్టళ్లకు చేరాలని మంత్రి ఆదేశించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి పాత కాంట్రాక్టర్లనే కొనసాగించాలన్నారు.  

మూడేళ్లు పట్టే ప్రక్రియ మూడు గంటల్లో పూర్తి

అనంతరం ధరణి నిర్వహణపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు 3 నెలల నుంచి మూడేళ్లు పట్టేదని గుర్తు చేశారు. ఆన్‌లైన్‌లో కొన్ని ప్రొవిజన్స్‌ లేకపోవడం వల్ల ధరణిలో చిన్న చిన్న పొరపాట్లు నెలకొన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. వాటిని త్వరలో పరిష్కరించనున్నట్టు తెలిపారు. జిల్లాలో 761 భూ వివాదాలకు సంబందించిన కోర్టు కేసులు ఉన్నాయని మంత్రి వివరించారు.సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, శాసన సభ్యులు క్రాంతికిరణ్‌, మాణిక్యరావు, మహిపాల్‌రెడ్డి,ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫరీదొద్దీన్‌, కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజ ర్షి షా, జెడ్పీటీసీ, ఎంపీపీలు, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo