Sangareddy
- Jan 21, 2021 , 00:36:12
VIDEOS
కొవిడ్ నిబంధనలు పాటించాలి

- వచ్చే నెల 1 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం
- 9,10 తరగతి విద్యార్థులకు తరగతులు
- సంగారెడ్డి జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్
- ఝరాసంగంలోని జడ్పీ, కస్తూర్బా గాంధీ పాఠశాల సందర్శన
ఝరాసంగం, జనవరి 20 : ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలలలు ప్రారంభమవుతాయని, పాఠశాలలను పరిశుభ్రం చేయాలని జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జడ్పీ, కసూర్బా గాంధీ పాఠశాలలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొమ్మిది, పదో తరతి విద్యార్థులకు బోధన జరుగుతుందన్నారు. పాఠశాల ఆవరణను, తరగతి గదులను శానిటైజేషన్ చేయించాలన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి 3 అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం విష్ణువర్ధ్దన్రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING