హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): గ్రామాల సమగ్రాభివృద్ధే దేశాభివృద్ధి అన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పల్లెల ప్రగతిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. కొత్త పంచాయతీచట్టంతో ప్రతి గ్రామానికి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నారు. ఈ నిధులతో గ్రామా ల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని భావిస్తున్నారు. ఈ మేరకు మండల పంచాయతీ అధికారి నుంచి అడిషనల్ కలెక్టర్ నుంచి వరకు నిత్యం గ్రామాల్లోనే ఉండేలా పురమాయించారు. గ్రామా ల్లో జరుగుతున్న పనులు, వెనుకబాటుకు గల కారణాలు విశ్లేషించేలా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు 20 అంశాలతో కూడిన చార్ట్‌ను రూ పొందిస్తున్నారు. ఈ చార్ట్ ఆధారంగా పల్లెల్లో అభివృద్ధి పనులను సీఎం కార్యాలయంతోపాటు, సచివాలయం నుంచి నిత్యం మానిటరింగ్ చేయనున్నారు. ఏ గ్రామంలో ఏ అంశంలో వెనుకబడుతున్నామో పరిశీలించి.. పరిష్కారంగా తగినచర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
రెండేండ్లు అవకాశమిచ్చినా..
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు కొత్తచట్టంలో నిధులు, విధులను స్పష్టంచేసింది. ప్రతినెలా రూ.339కోట్లు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమచేస్తున్నది. రెండేండ్లుగా క్రమంతప్పకుండా అందుతున్న నిధులతో గ్రామాల అభివృద్ధి వేగంగా జరిగేందుకు ఆస్కారమేర్పడింది. కానీ, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, విధుల నిర్వహణలో తాత్సారంచేస్తున్నట్టు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. కొన్ని గ్రామాల్లో కార్యక్రమాల నిర్వహణ సరిగా జరగడం లేదని, అధికారుల పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్టు గుర్తించారు.
వెనుకబాటుకు కారణాలపై విశ్లేషణ
రెండేండ్లపాటు అధికారులకు స్వేచ్ఛనిచ్చిన సీఎం కేసీఆర్.. గ్రామాల అభివృద్ధిలో అనుకున్న లక్ష్యా న్ని చేరుకోవడంలో వెనుకబడటానికి గల కారణాలను విశ్లేషించారు. ఉదారంగా ఉంటే లక్ష్యాన్ని సాధించలేమని భావించారు. వెంటనే కార్యరంగంలోకి దిగిన సీఎం.. అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ‘ఇప్పటివరకు మీకు సమయం ఇచ్చాను.. ఇకనుంచి నేనే స్వయంగా అకస్మిక తనిఖీలు నిర్వహిస్తా’ అంటూ ప్రకటించారు. తాత్సారం చేసిన అధికారులు, సిబ్బంది, సర్పంచ్‌లపై కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంశాలవారీగా చార్ట్ రూపొందించి మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఇప్పటికే చార్ట్ రూపొందించినట్టు తెలిసింది. వివిధ కాలాల్లో వచ్చే సీజనల్ వ్యాధులను గుర్తించి ముందుగానే నివారణ చర్యల కోసం కూడా చార్ట్‌ను రూపొందిస్తున్నారు.
పల్లెప్రగతి చార్ట్‌లోని అంశాలు ఇవే