మంగళవారం 02 మార్చి 2021
Sangareddy - Jan 17, 2021 , 00:11:55

జర్నలిస్టు డైరీ ఆవిష్కరణ

జర్నలిస్టు డైరీ ఆవిష్కరణ

సంగారెడ్డి టౌన్‌, జనవరి 16 : సంగారెడ్డిలోని ఐబీలో సంగారెడ్డి వర్కింగ్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 నూతన సంవత్సర డైరీని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, కలెక్టర్‌ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలోని సమస్యల పరిష్కారంతోపాటు సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ ప్రకారం మొదటగా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు ఇచ్చి అనంతరం జర్నలిస్టులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ లతావిజయేందర్‌రెడ్డి, సంగారెడ్డి వర్కింగ్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సాయినాథ్‌, కృష్ణ, గౌరవ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, కోశాధికారి డేవిడ్‌ రాజ్‌, నాయకులు పుండరీకం, సంగమేశ్‌, నాగభూషణం, నర్సింహులు, బాలయ్య, నరహరి, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo