మంగళవారం 02 మార్చి 2021
Sangareddy - Jan 17, 2021 , 00:11:55

ధరణి పోర్టల్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

ధరణి పోర్టల్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంత రావు

కలెక్టరేట్‌లో తాసిల్దార్లతో సమీక్ష

సంగారెడ్డి, జనవరి 16 : భూముల వివరాలు పారదర్శకంగా, రైతులకు మేలు జరిగే విధంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ను కలెక్టర్‌ హనుమంతరావు సమీక్షించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తాసిల్దార్లతో సమావేశం ఏర్పాటు చేసి ధరణి పోర్టల్‌ సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో  అన్నదాతలకు భూముల సమస్యలు తలెత్తకుండా వివరాలు నమోదు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పకడ్బందీగా నిర్వహించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీఆర్‌వో రాధిక రమణీ, రెవెన్యూ డివిజన్‌ అధికారులు అంబదాస్‌, రమేశ్‌ బాబు, విక్టర్‌, మెంచు నగేశ్‌గౌడ్‌, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

తాజావార్తలు


logo