బుధవారం 27 జనవరి 2021
Sangareddy - Jan 14, 2021 , 00:03:28

సింగూరు పరుగులు..

సింగూరు పరుగులు..

వనదుర్గాప్రాజెక్టుకు చేరిన జలాలు

కొల్చారం జనవరి 13: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి వదిలిన నీళ్లు మెదక్‌ జిల్లాలోని వనదుర్గాప్రాజెక్టును బుధవారం ఉదయం చేరుకున్నాయి. జిల్లాలోని కొల్చా రం, మెదక్‌, పాపన్నపేట, హవేలిఘన్‌పూర్‌ల పరిధిలోని ఆయకట్టుకు యాసం గి సీజన్‌లో సాగు కోసం నీటిని వదలాలని ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా,  సింగూరు ప్రాజెక్టు నుంచి పది విడుతలుగా నీటిని వదలాలని ఇంజినీరింగ్‌ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు ఈనెల 11వ తేదీన సింగూరు ప్రాజెక్టు నుంచి 0.35 టీఎంసీల నీటిని నీటిపారుదల శాఖాధికారులు విడుదల చేశారు. మంజీరా తీరం పొడవునా మడుగులు, చెక్‌డ్యాంలు నిండుకుని బుధవారం ఉదయం కొల్చారం మండలంలోని వనదుర్గాప్రాజెక్టుకు చేరుకున్నాయి. మంజీరా తీరం పొడవునా లిఫ్టుల ద్వారా పంటపొలాలకు నీటిని పారిస్తున్నారు. ఇదిలా ఉండగా వనదుర్గా ప్రాజెక్టులో డబ్బు ఐదుశాతం నీళ్లు చేరుకోవడంతో వరినాట్లు వేసేందుకు, దుక్కులను సిద్ధం చేసుకునేందుకు ఎడమకాల్వ ఫతేనహర్‌ కాల్వకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నీటిని వదలగా, కుడికాల్వ మహబూబ్‌నహర్‌ కాల్వకు నీటిపారుదల శాఖాధికారులు నీటిని విడిచిపెట్టారు.  


logo