శుక్రవారం 05 మార్చి 2021
Sangareddy - Jan 14, 2021 , 00:03:25

కమనీయం.. గోదారంగనాథుల కల్యాణం

కమనీయం.. గోదారంగనాథుల కల్యాణం

 పాల్గొన్న కల్యాణార్థులు, భక్తులు

శ్రీవారికి నైవేద్యంగా 15 కిలోల లడ్డు ప్రదానం జైశ్రీమన్నారాయణ నామంతో మార్మోగిన శ్రీవైకుంఠపురం

సంగారెడ్డి మున్సిపాలిటీ, జనవరి13 : పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్‌ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం(శ్రీవైకుంఠపురం) జై శ్రీమన్నారాయణ నామ మంత్రంతో మార్మోగింది. బుధవారం శ్రీవైకుంఠపురంలో గోదారంగనాథుల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణంలో పెండ్లి కాని వారు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం నుంచి గోదాదేవి, రంగనాథుల ఉత్సవ మూర్తులను ఊరేగిస్తూ మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికకు ఆటా పాటలతో అర్చకులు, భక్తులు తరలివచ్చారు. భక్తులు పూలమాలలతో ఉత్సవమూర్తులను ఆహ్వానించారు. కల్యాణంలో గోదారంనాథులకు ముత్యాలను తలంబ్రాలుగా సమర్పించి, హారతులు పట్టారు. ఆలయమంతా జై.. శ్రీమన్నారాయణ... జైజై శ్రీమన్నారాయణ నామమంత్రం, గోవిందా.... గోవిందా.... నామస్మరణతో మార్మోగింది.  శ్రీవారికి నైవేథ్యంగా 15 కిలోల లడ్డూను సమర్పించారు.  భక్తులు గోదారంగనాథుల కటాక్షం పొందారు. కార్యక్రమంలో జై శ్రీమన్నారాయణ చరిటబుల్‌ ట్రస్టు సభ్యులు,  శ్రీ జగన్నాథ తదియారధన (అన్నదాన) సేవా ట్రస్టు సభ్యులు, శ్రీ గోకులం గోశాల సభ్యులు, హిందూ బంధువులు, భక్తులు పాల్గొన్నారు. 


VIDEOS

logo