తీన్మర్

- మూడు డివిజన్లలో టీఆర్ఎస్ అద్భుత విజయం
- గులాబీ శ్రేణుల్లో సంబురాలు
- భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లలో భారీ మెజార్టీ
- గ్రేటర్‌లోనే పటాన్చెరు టీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధికంగా 6,082 మెజార్టీ
- రామచంద్రాపురం 5,759, భారతీనగర్ 4,658 ఓట్ల మెజార్టీ
సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయడంఖా మోగించింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లా పరిధిలోని భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లలో భారీ మోజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో మూడు డివిజన్లు ఉండగా, మూడింట్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. మూడు డివిజన్లలో కూడా 4 నుంచి 6వేలకు పైగా మెజార్టీ టీఆర్ఎస్కు రావడంపై పార్టీలో సంతోషం నెలకొంది. ఈ మూడు డివిజన్లకు మంత్రి హరీశ్‌రావు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, చింతా ప్రభాకర్, పార్టీ నేతలు బక్కి వెంకటయ్యతో పాటు సిద్దిపేట, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, అందోలు పార్టీ ముఖ్య నేతలు కూడా బాగా పనిచేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేయడంతోనే ఈ అద్భుతమైన ఫలితాలు వచ్చాయని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురిదీ భారీ విజయం..
పటాన్చెరు సర్కిల్ 22 పరిధిలోని భారతీనగర్ (111), రామచంద్రాపురం (112), పటాన్చెరు (113) మూడు డివిజన్ల పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థ్ధు లు అద్భుత విజయం సాధించారు. భారతీన గర్ అభ్యర్థి సింధూఆదర్శ్‌రెడ్డి 4,658 ఓట్లు, రామచం ద్రాపురం డివిజన్ అభ్యర్థి పుష్పానగేశ్ యాదవ్ 5,759, పటాన్చెరు డివిజన్ నుంచి మెట్టుకుమార్ యాదవ్ 6,082 ఓట్లతో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా, అందులో సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఈ మూడు డివిజన్లలోనే భారీ మెజార్టీ రావడంతో జిల్లా నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ సర్కారు వైపే ప్రజలు
-వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్
తాజావార్తలు
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?
- కేంద్ర ప్రతిపాదనపై రైతుల విముఖత