కాబోయే అమ్మకు కమ్మని భోజనం

మహిళల అభ్యున్నతి, వారి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. కొన్నేండ్లుగా ప్రభుత్వం గర్భిణుల కోసం ‘కేసీఆర్ కిట్'తో పాటు ప్రోత్సాహకంగా డబ్బులు అందిస్తున్నది. ‘అమ్మఒడి’ ద్వారా గర్భిణుల కోసం ప్రత్యేక వాహనం అందుబాటులోకి తెచ్చింది. ప్రసవ సమయంలో దవాఖానకు, ప్రసవం తర్వాత ఇంటికి చేర్చే సౌకర్యం కల్పిస్తున్నది. జిల్లా దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణులకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం మెదక్ జిల్లాలో 4న (నేడు), సంగారెడ్డి జిల్లాలో 7న ప్రారంభించనున్నట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు.
-సంగారెడ్డి మున్సిపాలిటీ
సంగారెడ్డి జిల్లాలో 19,845 మంది గర్భిణులకు లబ్ధి..
సంగారెడ్డి జిల్లాలో కేంద్ర దవాఖానతో పాటు నాలుగు ఏరియా దవాఖానలు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 30ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 246 సబ్ సెంటర్లు, నాలుగు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా దవాఖానకు ప్రతిరోజు సుమారు 150 నుంచి 200 మంది గర్భిణులు వైద్య పరీక్షలకు వస్తుంటారు. ఏరియా దవాఖానలకు 100 నుంచి 120 మంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు ఏఎన్సీ-డే రోజు (సోమ, శుక్రవారం) 30 నుంచి 50 మంది గర్భిణులు వైద్య పరీక్షలకు వస్తుంటారు. వారంలో రెండుసార్లు దవాఖానలకు వచ్చి భోజనం చేసేందుకు ఇబ్బందులు పడుతుంటారు. వైద్య పరీక్షలు పూర్తయ్యేసరికి మధ్యాహ్న భోజన సమయం దాటడంతో గర్భిణులు ఆకలికి అలమటిస్తుండేవారు. గర్భిణుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వైద్య పరీక్షలకు వచ్చిన రోజు ఒకపూట అన్నం, పప్పు, కూరగాయ, గుడ్డుతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. కరోనా కారణంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకునే గర్భిణులకు ఒకపూట ఆహారానికి సరిపడా సరుకులు నేరుగా గర్భిణుల ఇండ్లకే అందిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త కార్యక్రమం ద్వారా సంగారెడ్డి జిల్లాలో 19,845 మంది గర్భిణులకు లబ్ధి చేకూరనున్నది.
7 నుంచి సబ్ సెంటర్లలో ప్రారంభం..
గర్భిణులకు మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభిస్తాం. సంగారెడ్డి జిల్లాలో 246 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఈ సబ్ సెంటర్లకు వచ్చే గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజనం అందించనున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీ, సీహెచ్‌సీలకు త్వరలో మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమం ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమాన్ని అక్షయపాత్ర సహకారంతో అందించనున్నాం. ఈ నెల 7 నుంచి అంగన్వాడీ సెంటర్ల ద్వారా సబ్ సెంటర్లకు మధ్యాహ్న భోజనం అందిస్తాం.
- పద్మావతి, ఐసీడీఎస్ పీడీ, సంగారెడ్డి
తాజావార్తలు
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
- మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
- మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ కలకలం
- చలి గుప్పిట ఢిల్లీ.. కప్పేసిన పొగమంచు..