గెలిపించండి.. మీ సేవకుడిగా ఉంటా..

- పటాన్చెరు టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టుకుమార్‌యాదవ్
పటాన్చెరు : తనను గెలిపిస్తే ఐదేండ్లు మీ సేవకుడిగా ఉండి పనిచేస్తానని పటాన్చెరు 113 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టుకుమార్‌యాదవ్ అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్లో ఆయన ప్రచారం నిర్వహించారు. గొల్లబస్తీలో ఇంటింటా తిరిగి ఓట్లు అడిగారు. వృద్ధులు, మహిళలు, యువతను కలిసి ఓట్లు అభ్యర్థించారు. టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రతి ఆడబిడ్డకు టీఆర్ఎస్ సర్కారు అందిస్తూ అండగా నిలుస్తున్నదని తెలిపారు. వృద్ధులు, వితంతులకు, ఒంటరి మహిళలకు రూ. 2వేల పింఛన్ అందిస్తున్నది టీఆర్ఎస్ సర్కారు మాత్రమేనన్నారు. దివ్యాంగులకు రూ. 3 వేల పింఛన్ ఇస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధి తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ సమస్యలపై తనకు అవగాహన ఉందని, గెలిపిస్తే వాటి పరిష్కారానికి కృషిచేస్తాన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులను కల్పించడం తన ధ్యేయం అన్నారు. టీఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో పటాన్చెరు పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. రూ. 150 కోట్ల విలువైన స్థలాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ యార్డు నిర్మాణానికి అందజేసిందని గుర్తు చేశారు. మార్కెట్ అభివృద్ధి చెందితే పటాన్చెరులో వ్యాపారాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి బస్తీలో రోడ్లు వేశామని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించి ఇచ్చామన్నారు. సుల్తాన్పూర్, పటాన్చెరు, పాశమైలారం, శివానగర్‌లో వస్తున్న పరిశ్రమల్లో యువతకు ఉపాధి కూడా లభిస్తున్నదన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు.
తాజావార్తలు
- స్పెయిన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..
- ‘ఓటిటి రిలీజ్‌పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’
- సత్తా చాటితేనే సర్కారు కొలువు