విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

రైతువేదిక, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు
అందుబాటులోలేని అధికారులపై ఆగ్రహం
హత్నూర : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రం హత్నూరలో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కలెక్టర్ రైతు వేదిక పనుల పరిశీలనకు వచ్చిన సమయంలో మండలస్థాయి అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వివరాలు ఎవరిని అడిగితెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సమయపాలన పాటించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, రైతువేదిక నిర్మాణ పనులు నాలుగురోజుల్లో పూర్తి చేసేలా కృషి చేయాలని తెలుపడంతో సంబంధిత ఏఈ మరింత గడువుకావాలని కోరడంతో ఏఈపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోకపోతే బదిలీవేటు తప్పదన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో ముచ్చటించగా గన్నీబ్యాగుల కొరత ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే గన్నీబ్యాగుల జిల్లా ఇన్చార్జి డీఎం మల్లేశంకు ఫోన్‌చేసి ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచినప్పటికీ ఎందుకు సరఫరా చేస్తలేరని మందలించారు. కొనుగోలు కేంద్రాలవద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం చింతల్‌చెరులో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ జయరాం, ఏఈ సురేశ్, ఐకేపీ ఏపీఎం శ్రీలత తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
- ‘ఉప్పెన’ వేగాన్ని ఆపతరమా..!
- జీ7కు రండి.. ప్రధాని మోదీకి బ్రిటన్ ఆహ్వానం
- కర్నూలు వాసులకు గుడ్ న్యూస్.. ఎయిర్ పోర్ట్‌కు డీజీసీఏ అనుమతి
- అమెరికాలో అతి పెద్ద రైతు ఎవరో తెలుసా..?
- మరిది కోసం సినిమా సెట్ చేసిన సమంత..!
- పెళ్లి చేయమన్నందుకు కొడుకుపై దాడిచేసిన తండ్రి