టెహ్రాన్, మే 17: ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ వయస్సు 83 ఏండ్లు. గడిచిన 65 ఏండ్లలో ఆయన ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఒక్కరోజు స్నానం చేయకపోతేనే చెమట కంపును భరించలేం. అలాంటిది హాజీ అన్ని ఏండ్లు స్నానం చేయకుండా ఎలా ఉన్నాడబ్బా.. అనిపిస్తున్నది కదా. కానీ, ఆయనకో విచిత్రమైన నమ్మకం ఉంది. స్నానం చేస్తే తన ఆరోగ్యం దెబ్బతింటుందని హాజీ నమ్మకం. హాజీ ప్రస్తుతం ఒంటరి. తనకు ఎవరైనా తోడు కావాలని అనుకొంటున్నాడు. కానీ 65 ఏండ్లుగా స్నానమే చేయని వ్యక్తితో ఎవరు కలిసి జీవిస్తారు.