బుధవారం 20 జనవరి 2021
Sangareddy - Nov 13, 2020 , 01:55:19

రైతు వేదికల నిర్మాణం వేగవంతం చేయాలి

 రైతు వేదికల నిర్మాణం వేగవంతం చేయాలి

రాయికోడ్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను ఈ నెల 24వ తేదీ లోపు పూర్తి చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని సింగితం, గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్‌  మాట్లాడుతూ రైతు వేదిక నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పనులు ఆలస్యంగా నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్‌ వెంట ఆర్‌ఐ ప్రభాకర్‌రావు, వీఆర్‌వో మల్లేశం ఉన్నారు. logo