బుధవారం 27 జనవరి 2021
Sangareddy - Nov 04, 2020 , 00:55:03

కొనసాగుతున్న ‘ధరణి’ రిజిస్ట్రేషన్లు

కొనసాగుతున్న ‘ధరణి’ రిజిస్ట్రేషన్లు

రాయికోడ్‌ : మండల కేంద్రంలో ధరణి రిజిస్ట్రేషన్‌ సేవలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని తహసీల్దార్‌ రాజయ్య తెలిపారు. మంగళవారం సంగాపూర్‌ గ్రామానికి చెందిన భూమిని ఇతరులకు విక్రయించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్‌ చేసిన పత్రాలను తహసీల్దార్‌ రైతులకు అందజేశారు. రాయికోడ్‌ మండలంలో మొట్టమొదటగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న మాధురికి తహసీల్దార్‌ పూలబొకే అందజేసి మిఠాయి తినిపించారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్‌ కిష్టయ్య, ఆర్‌ఐ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. 

మునిపల్లిలో..

మునిపల్లి : మండల కేంద్రమైన మునిపల్లి తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రెండోరోజు కొనసాగింది. నలుగురు స్లాట్లు బుక్‌ చేసుకోగా ఒకరి రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని తహసీల్దార్‌ ప్రవీణ్‌ తెలిపారు. 


logo