ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 31, 2020 , 00:16:20

రైతుల ‘ప్రగతి’ కోసమే..

రైతుల ‘ప్రగతి’ కోసమే..

 నిజాంపేట: అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, రైతేరాజు కావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రైతు వేదికలను ప్రవేశపెట్టారు. సాగు చేసే పంటలు, సస్యరక్షణ పద్ధతులు తగు విషయాలపై రైతుల ఆలోచనలు, అధికారుల సూచనలను చర్చించేందుకు రైతు వేదిక నిర్మాణం ఎంతో దోహదపడుతాయి. ఈ క్రమంలో నిజాంపేట, నస్కల్‌ గ్రామాల్లో రైతు వేదికలు నిర్మాణ దశలో ఉండగా, కల్వకుంటలో రైతు వేదిక ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

నిజాంపేట రైతు వేదిక నిర్మాణానికి రూ.12 లక్షలు విరాళం 

నిజాంపేట మండలంలోని ఖాసీంపూర్‌కి చెందిన అందె ప్రతాప్‌రెడ్డి వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. నిజాంపేట జడ్పీటీసీ విజయ్‌కుమార్‌ మండలాభివృద్ధికి తనవంతుగా సాయం అందించాలని కోరగా, అందుకు అందె ప్రతాప్‌రెడ్డి స్పందించి నిజాంపేట లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణానికి విరాళంగా రూ.12 లక్షలు డీడీ రూపంలో వ్యక్తిగత కార్యదర్శి నరేందర్‌రెడ్డి ద్వారా జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్‌కు అందజేశారు. రై తు కుటుంబంలో పుట్టి రైతుల కోసం నిర్మిస్తున్న రైతు వేదికకు  సాయమందించిన ప్రతాప్‌రెడ్డిని మండల రైతులు, అధికారులు అభినందించారు.


కనువిందు చేస్తున్న 

కాళేశ్వరం ప్రాజెక్టు..!

గుమ్మడిదల: రాష్ట్ర రైతాంగానికి వివిధ రకాల పంటలపై, సబ్సిడీలపై, రుణాలపై అవగాహన కలిగించేందుకు సర్కారు చేపట్టిన రైతువేదికలు అత్యంత అద్భుతంగా నిర్మాణాలు జరిగాయి. గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు వేదిక భవనం పూర్తి కాగా, సమావేశ మందిరంలో అప్పటి కలెక్టర్‌ హనుమంతరావు సర్పంచ్‌ చిమ్ముల నర్సింహారెడ్డి తనసొంత నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ను వేయించారు. దీంతో ఆకట్టుకుంటున్నది.