గురువారం 03 డిసెంబర్ 2020
Sangareddy - Oct 31, 2020 , 00:17:18

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సంగారెడ్డి : సదాశివపేట పట్టణం సాయిబాబా గుడి సమీపంలో గుర్తు తెలియని మృతదేహాం లభ్యమైంది. మున్సిపల్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న మారేపల్లి కిరణ్‌  సాయిబాబా ఆలయ సమీపంలో విధులు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బెజగం సాగర్‌ వెంచర్‌లో మృతదేహాన్ని చూశాడు. మృతుడు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మృతుడి ఒంటిపై బ్లూ కలర్‌ షర్టుపై పువ్వులు, గ్రీన్‌ కలర్‌ ప్యాంటు ఉన్నది. అతడి పక్కన మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడని  స్టేషన్‌ హౌస్‌ అధికారి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించామన్నారు. మృతదేహాన్ని గుర్తిస్తే  పోలీసులకు 9490617011కు సమాచారం ఇవ్వాలని స్టేషన్‌ హౌస్‌ అధికారి కోరారు.