ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 29, 2020 , 00:08:43

మహిళా కానిస్టేబుళ్లకు పోస్టింగ్‌లు

మహిళా కానిస్టేబుళ్లకు పోస్టింగ్‌లు

సంగారెడ్డి : ప్రభుత్వం పోలీస్‌ యంత్రంగాన్ని పటిష్టం చేసేందుకు చేపట్టిన నియామకాల్లో ఎంపికైన మహిళా కానిస్టేబుళ్లకు పోస్టింగ్‌లు కేటాయించారు. బుధవారం ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి జిల్లాలోని పోలీస్‌స్టేషన్లకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 21 పోలీస్‌ స్టేషన్లలో నూతనంగా ఎంపికైన 32 మంది మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో చేరనున్నారు. ఆయా స్టేషన్లకు కేటాయిస్తూ ఎస్పీ ఆదేశాలు ఇవ్వడంతో మహిళా కానిస్టేబుళ్లకు కేటాయించిన స్టేషన్లలో రిపోర్టు చేశారు. ఆయా పోలీస్‌ స్టేషన్ల అధికారుల ఆదేశాలతో విధులు నిర్వహించనున్నారు. పటాన్‌చెరు-2, చిరాగ్‌పల్లి-2, జిన్నారం-2, కోహీర్‌-2, ఇంద్రకరణ్‌-1, కొండాపూర్‌-2, జహీరాబాద్‌(రూరల్‌)-1, జోగిపేట-1, సంగారెడ్డి(టౌన్‌)-2, సదాశివపేట-1, గుమ్మడిదల-3, నారాయణఖేడ్‌-1, హత్నురా-3, కల్హెర్‌-1, కంగ్టి-1, సంగారెడ్డి(రూరల్‌)-2, హద్నుర్‌-1, పుల్‌కల్‌-1, సిర్గాపూర్‌-1, ఐడీఎ బొల్లారం-1, వట్‌పల్లి-1 పోలీస్‌ స్టేషన్లకు కేటాయించారు.