ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 29, 2020 , 00:08:41

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన పాపిరెడ్డి

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన పాపిరెడ్డి

సంగారెడ్డి : ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పాపిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 21న ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతులు నిర్వహించిన న్యాయమూర్తి సాయి రమాదేవి నిజామాబాద్‌కు బదిలీ కావడంతో న్యాయమూర్తి పాపిరెడ్డికి పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే.  ఇప్పటి వరకు జిల్లాలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతి పొందారు.

న్యాయమూర్తికి వీడ్కోలు పలికిన ఉద్యోగులు...

ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి సాయి రమాదేవికి న్యాయమూర్తులు, కోర్టు ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేసి వీడ్కోలు పలికారు. ఏడాదిన్నరకుపైగా జిల్లా బాధ్యతలు నిర్వహించి నిజామాబాద్‌కు బదిలీ అయిన న్యాయమూర్తికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఏవో విజయ్‌ కుమార్‌, రవిశంకర్‌ కుమార్‌, విజయ్‌ నాయక్‌, చరణ్‌, గోపాల్‌రెడ్డి, ఆసిఫ్‌ ఇక్బాల్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.