శనివారం 05 డిసెంబర్ 2020
Sangareddy - Oct 29, 2020 , 00:08:35

గేట్‌ కూలీ సెక్యూరిటీ గార్డు మృతి

గేట్‌ కూలీ సెక్యూరిటీ గార్డు మృతి

రూ. 17లక్షల నష్టం పరిహారం అందించేందుకు పరిశ్రమ హామీ

పటాన్‌చెరు : రుద్రారం గ్రామ పరిధిలోని తోషీబా పరిశ్రమలో భారీ గేట్‌ ఊడిపడి సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. తోషిబా కార్మికులు, సీఐటీయూ యూనియన్‌ నాయకుల వివరాల ప్రకారం... పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని తోషిబా పరిశ్రమలో సంగారెడ్డి మండలం రాజంపేటకు చెందిన మహ్మద్‌ (40) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మంగళవారం నైట్‌ డ్యూటీలో ఉండగా పరిశ్రమ మెయిన్‌గేట్‌ ఒక్కసారిగా మహ్మద్‌పై పడింది. దీంతో తీవ్ర గాయాలు కాగా, సంగారెడ్డిలోని బాలాజీ దవాఖానకు పరిశ్రమ సిబ్బంది తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సర్కారు దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే  మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతుడి కుటుంబీకులు యూనియన్‌ నాయకులను ఆశ్రయించగా, సీఐటీయూ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రాజయ్య, పరిశ్రమ కార్మిక సంఘం నాయకులు అనంతరావు, శ్రీనివాస్‌రెడ్డి పరిశ్రమ అధికారులతో మాట్లాడారు. కంపెనీ నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ జనరల్‌ మేనేజర్‌ రూ. 17లక్షల నష్ట పరిహారం, దహన సంస్కారాలకు రూ. 10వేలు  ఇచ్చేందుకు అంగీకరించారు. కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు పటాన్‌చెరు పోలీసులు తెలిపారు.