శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sangareddy - Oct 28, 2020 , 00:05:32

అభివృద్ధిపై దృష్టి సారించాలి

అభివృద్ధిపై దృష్టి సారించాలి

అందోల్‌ : గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని వట్‌పల్లి ఎంపీడీవో గీత సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ గ్రామాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులు పూర్తయినందున చెత్తను తరలించాలని తెలిపారు. అదేవిధంగా రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో యూసుఫ్‌, కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు.

తాజావార్తలు