ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 27, 2020 , 00:04:10

ఆలయ పునర్నిర్మాణానికి కృషి

ఆలయ పునర్నిర్మాణానికి కృషి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు : పటాన్‌చెరులోని పురాతన చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు పట్టణంలోని అతి పురాతనమైన చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని తిరిగి నిర్మించేందుకు వేదపండితులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయదశమిని పురస్కరించుకుని చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని తిరిగి నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయ వాస్తు ప్రకారం, వేదపండితుల సలహాల మేరకు ఆలయాన్ని నిర్మించుకుంటామన్నారు. దేవాలయాలు భక్తుడికి, దేవుడికి అనుసంధానం చేసే గొప్ప వేదికలన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి దేవాలయాన్ని సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పటాన్‌చెరు మాజీ సర్పంచ్‌ దేవేందర్‌రాజు, నాయకులు నర్రా భిక్షపతి, విజయ్‌కుమార్‌, మాణిక్యం, గూడెం మధుసూదన్‌రెడ్డి, పుర ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

నేడు ట్రాక్టర్ల అందజేత

జిన్నారం : మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన సొంత ఖర్చుతో నేడు ట్రాక్టర్లను అందజేయనున్నట్టు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిన్నారంలోని గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో మంగళవారం ఉదయం 9:30 గంటలకు మంగంపేట, రాళ్లకత్వ, శివనగర్‌, సోలక్‌పల్లి, వావిలాల, నల్తూర్‌, జంగంపేట, మాదారం గ్రామాల సర్పంచ్‌లకు ఎమ్మెల్యే ట్రాక్టర్లను అందజేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు హాజరుకావాలని కోరారు.