సోమవారం 30 నవంబర్ 2020
Sangareddy - Oct 27, 2020 , 00:04:09

సంగారెడ్డి కలెక్టర్‌గా వెంకట్రామ్‌రెడ్డి

సంగారెడ్డి కలెక్టర్‌గా వెంకట్రామ్‌రెడ్డి

ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు 

నేడు బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి టౌన్‌: కలెక్టర్‌గా వెంకట్రామ్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావును మెదక్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న వెంకట్రామ్‌రెడ్డిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. సంగారెడ్డి జిల్లాతో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పవచ్చు. గతంలో జిల్లాలో ఏజేసీ, జేసీగా విధులు నిర్వహించారు. జిల్లాల పునర్విభజనలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. కాగా, జాయింట్‌ కలెక్టర్‌గా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పనిచేయడంతో జిల్లాపై పట్టు ఉన్నది. అదేవిధంగా జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులకు పరిచయం ఉండడంతో జిల్లా అభివృద్ధికి తోత్పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.  

నేడు బాధ్యతల స్వీకరణ..

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామ్‌రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చార్జీ తీసుకుంటారని సమాచారం. హైదరాబాద్‌ నుంచి నేరుగా సంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుని బాధ్యతలు స్వీకరించనున్నారు.