శనివారం 05 డిసెంబర్ 2020
Sangareddy - Oct 25, 2020 , 00:20:51

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

నారాయణఖేడ్‌/ఝరాసంగం : నవరాత్రోత్సవాల్లో భాగంగా  నారాయణఖేడ్‌ పట్టణంలోని శాస్త్రీనగర్‌లో ఏర్పాటు చేసిన భవానీ మాతను శనివారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సతీమణి జయశ్రీరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజ లు చేశారు. భవానీ మాత మం డపంలో నిర్వహించిన చండీహోమంలో పాల్గొన్నారు. శాస్త్రీనగర్‌లో నవరాత్రులను నిర్వహిస్తున్న యువకులను ఆమె అభినందించారు. ఝరాసంగం మండలంలో దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన శైవ క్షేత్రం కేతకీ సంగమేశ్వర ఆలయ మండపంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. దుర్గాష్టమి కావడంతో అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.