శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sangareddy - Oct 25, 2020 , 00:20:49

సద్దుల బతుకమ్మ సంబురాలు

సద్దుల బతుకమ్మ సంబురాలు

సంగారెడ్డి, పటాన్‌చెరు, అందోల్‌ నియోజకవర్గాలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలు శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమైన బతుకమ్మలను మహిళలు సహజసిద్ధమైన పూలతో తయారు చేశారు. మహిళలు, యువతులు నూతన వస్ర్తాలు ధరించి అందంగా పేర్చిన పూల బతుకమ్మలను ఒకచోట చేర్చి పాటలు పాడుతూ ఆటలాడారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి  ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పీజేఆర్‌ కాలనీలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సతీమణి యాదమ్మ, మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి సతీమణి సునీత, కౌన్సిలర్లు మాధవి మహాదేవరెడ్డి, రాజేశ్వరి, కల్పన, మంజుల, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు.

జోగిపేటలో హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే..

అందోల్‌-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని అందోల్‌ చెరువు కట్టపై ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ప్రారంభించారు. అనంతరం బతుకమ్మ ఘాట్లను పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులకు సూచించారు. 

తాజావార్తలు