ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 25, 2020 , 00:20:49

ప్రకృతి విపత్తులను సమన్వయంతో ఎదుర్కోవాలి

ప్రకృతి విపత్తులను సమన్వయంతో ఎదుర్కోవాలి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

రామచంద్రాపురం/అమీన్‌పూర్‌ : ప్రకృతి విపత్తులను సమన్వయంతో ఎదుర్కోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సూచించారు. శనివారం భారతీనగర్‌ డివిజన్‌లోని ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ ఏరియాలో వరద బాధితులకు డివిజన్‌ కార్పొరేటర్‌ సింధూఆదర్శ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణగౌడ్‌, బూన్‌, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. అమీన్‌పూర్‌లో వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. 

క్రీడలతో మానసిక ఉల్లాసం..

అమీన్‌పూర్‌ : క్రీడలతో శారీరక దారుఢ్యమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అమీన్‌పూర్‌ మండల పరిధిలోని పటేల్‌గూడ ఎల్లంకి ఇంజినీరింగ్‌ కాలేజీ ఆవరణలో జిల్లా హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్రౌండ్‌ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అమీన్‌పూర్‌ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ దేవానంద్‌, హాకీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కళాశాల చైర్మన్‌ సదాశివరెడ్డి, ప్రముఖ హాకీ క్రీడాకారుడు రఘునందన్‌రెడ్డి, హాకీ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.