Sangareddy
- Oct 25, 2020 , 00:20:47
బంగారు ఆభరణాలు భద్రమంటూ.. వృద్ధులే లక్ష్యంగా చోరీలు

అందోల్: వయస్సు పైబడిన వారిని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న మోసగాడిని జోగిపేట పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం జోగిపేట ఠాణాలో సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన మౌలాన్సా బ్ ఒంటరిగా ఉన్న పెద్దవయస్సు మహిళలతో పరిచయం చేసుకొని ఇక్కడ దొంగలున్నారు.. వస్తువులు జాగ్రత్త అంటూ వా రిని నమ్మిస్తాడు. బంగారం, ఇతర వస్తువులు తీసి జాగ్రత్త చేసే క్రమంలో వెంటతెచ్చుకున్న కవర్లలో వస్తువులను దాచి, వారికి మాత్రం రాళ్లతో కూడిన కవర్లను అప్పగిస్తాడు. ఇప్పటి వరకు హత్నూర, జోగిపేట పోలీస్స్టేషన్ల పరిధిలో నలుగురిని మోసం చేయగా, అతడిపై నాలుగు కేసులున్నాయి. శనివారం జోగిపేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని అదుపులోకి తీసుకుని 5 తులాల బంగారు గుండ్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- ప్రభాస్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
- రికార్డ్.. ఒకే రోజు 3 లక్షల మందికి టీకా
- అదనంగా 2లక్షల వ్యాక్సిన్ డోసులు ఇవ్వండి : కేంద్రానికి ఉత్తరాఖండ్ వినతి
- రైతు సంఘాల నేతల హత్యకు కుట్ర.. ఒకరి అరెస్టు
- ప్రతిదానికి వ్యతిరేకత పద్ధతి కాదు: బెంగాల్ గవర్నర్
- భారత్-చైనా ఉద్రిక్తతలు.. రేపు 9వ విడుత సైనిక చర్చలు
- భూ కేటాయింపు పత్రాలను అందజేసిన ప్రధాని
- విజయ్‌సాయిరెడ్డిపై దాడి కేసు.. ఏ1న్గా చంద్రబాబు!
- అప్రమత్తతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట: మంత్రి పువ్వాడ
- మెగా బ్రదర్ ఫ్యామిలీ పిక్ అదుర్స్!
MOST READ
TRENDING